ప్యాపిలిలో ప్రారంభోత్సవాల పరంపర.

 




*ప్యాపిలిలో ప్రారంభోత్సవాల పరంపర*



*రూ.16 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం*


*రూ.30 లక్షలతో పునరుద్ధరించిన షాదిఖానా ప్రారంభం*


*రూ.67 లక్షలతో ప్యాపిలి బస్ స్టేషన్ లో వసతుల ప్రారంభోత్సవం*


*పాదయాత్ర, బైక్ ర్యాలీలతో జనంతో మమేకమైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన*


*'ముబారక్ టైల్స్, గ్రానైట్స్' షాప్ ను ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*రూ.3కోట్లతో చేపట్టిన వెంగలాంపల్లి చెరువు పర్యాటక అభివృద్ధి పనుల పరిశీలన*


ప్యాపిలి, నంద్యాల జిల్లా, డిసెంబర్,12 (ప్రజా అమరావతి); డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన ప్రారంభోత్సవాల పరంపర కొనసాగింది. రూ.16 కోట్లతో ప్యాపిలి పట్టణంలోని 2 లైన్ల దారిని 4 లైన్లుగా రహదారిగా విస్తరించి మంగళవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అనంతరం అధిక సంఖ్యలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలతో పాటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 5 కి.మీ పాదయాత్ర చేశారు. మహిళలతో మాట్లాడుతూ..స్థానికంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా ఇంకా ఏవైనా సమస్యలున్నాయా అంటూ వారితో ముచ్చటించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ రూపు రేఖలు మార్చారని, అద్భుతంగా తీర్చిదిద్దారంటూ ప్యాపిలి మహిళలు మంత్రి బుగ్గన కృషిపై ప్రశంసల జల్లు కురిపించారు. పాదయాత్రలో భాగంగా సాయిబాబా గుడిని సందర్శించారు. ఆలయంలోని స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. పలకరించిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ కొత్త రహదారిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర పూర్తి చేశారు. అనంతరం దాబాలో భోజనాల అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


*రూ.67 లక్షలతో ప్యాపిలి బస్ స్టేషన్ వసతులు, రూ.30 లక్షలతో ఆధునికీకరించిన షాదిఖానా ప్రారంభం*


ప్యాపిలి ప్రజలకు ముఖ్యమైన బస్ స్టేషన్ లో వసతులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  ప్రారంభించారు. రూ.67 లక్షలతో బస్ స్టేషన్ లో మరుగుదొడ్లు సహా పలు కీలక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకుల సహకారంతో ఇలాగే పరిశుభ్రంగా బస్ స్టేషన్ ప్రాంగణాన్ని కొనసాగించాలన్నారు. అంతకు ముందు రూ.30 లక్షలు ఖర్చు పెట్టి ఆధునికీకరించిన షాదిఖానా భవనాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రారంభించారు. అందుకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. వంట శాల, చేతులు శుభ్రపరచుకునే చోటు, మరుగుదొడ్లు, మొక్కలు పెంచే ప్రాంగణాలను ఆయన పరిశీలించారు. ముస్లిం సోదర సోదరీమణులంతా షాదిఖానాను ఉపయోగించుకోవాలన్నారు. ఆ తర్వాత ముబారక్ టైల్స్, గ్రానైట్స్ దుకాణాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అంతకు ముందు ప్యాపిలికి విచ్చేసిన ఆర్థిక మంత్రికి పుర ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నో కీలక  పనులు చేపట్టి 

ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు యువత బైక్ ర్యాలీ చేస్తూ కృతజ్ఙతలు తెలిపారు.


*ప్యాపిలిలో రూ.3కోట్లతో చేపట్టిన వెంగలాంపల్లి చెరువు పర్యాటక అభివృద్ధి పనుల పరిశీలన*


 ప్యాపిలి పర్యటన ముగించుకున్న అనంతరం డోన్ కు వెళ్లే దారిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెంగలాంపల్లి చెరువు పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3 కోట్లతో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే చుట్టపక్కల ఆహ్లాదకర వాతావరణం   నెలకొంటుందన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్, అధికారులను మంత్రి బుగ్గన ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,  మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగుల శ్యామ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి వైసీపీ మండల అధ్యక్షులు బొర్రా మల్లికార్జునరెడ్డి, ప్యాపిలి జెడ్పీటీసీ శ్రీరామ్ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మెట్టు వెంకటేశ్వర్లు రెడ్డి,  సింగిల్ విండో ఛైర్మన్ బోరెడ్డి రామచంద్రారెడ్డి, ప్యాపిలి సర్పంచ్ చెవిటి లక్ష్మిదేవి, ఉపసర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Comments