నేడు గాంధీభవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

 *నేడు గాంధీభవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు*











హైదరాబాద్:డిసెంబర్ 09 (ప్రజా అమరావతి);

ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పట్టిన రోజు వేడుకలను గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజర య్యారు.సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌కు రావడం ఓ విశేషం..


డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో రేవంత్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీ యంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా తెలంగాణ ఆకాం క్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు.


సోనియా జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా ఆయు రారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.


కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. గడిచిన పదేళ్లలో పార్టీ కోసం కష్టపడి అనేక మంది కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారు. ఆస్తులను అమ్ముకున్నారు,



ప్రాణాలు పొగొట్టుకున్న వారు ఉన్నారు. అయినా పార్టీని వదులు కోలేదు. పార్టీలోని ప్రతి కార్యకర్తలకు మాట ఇస్తున్నాన్నారు.


ఇది పేదల ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తామ న్నారు. ఇందిరమ్మ రాజ్యం లో సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు....

Comments