లక్షలాదిమంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు.

పర్చూరు (ప్రజా అమరావతి);


పర్చూరు లో తుఫాను బాధితులను ఉద్దేశించి మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు:-


- తుపాను బాధితులను పరామర్శించడానికి వచ్చాను. 

- ఎన్ని లక్షల ఎకరాల పంట  నష్టం వచ్చిందో, పంటలవారీగా చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను.

-ఉప్పటూరు నుంచి వస్తూ చూశాను, పరుచూరులో పంట కాలువకు అటుపక్క, ఇటుపక్క గట్లన్నీ వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు.

- గట్ల ఆక్రమణతో తుపాను వచ్చింది, మీ కొంప ముంచింది.

-నాలుగైదు సంవత్సరాలుగా వైసీపీ అసమర్థ పాలనతో అడుగడుగున మీ జీవితాల్లో చీకటి నెలకొంది

- పరుచూరు లో ఏ ఒక్కరి జీవితాలైనా బాగుపడ్డాయా? 

- లక్షలాదిమంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు.


- సైకో ముఖ్యమంత్రి పట్టిసీమ నుండి నీళ్ళు వదలకుండా పంప్ లను బంద్ చేశాడు

- వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించలేదు

- ఒక్క డ్రైన్ రిపేరు చేయలేదు, దీంతో కంపచెట్లు మొలిచాయి.

- డ్రైన్ లో పోవాల్సిన నీరు పొలంపైకి వచ్చి పొలాలలోని పంట మునిగిపోయింది. 

- పంటలు నష్టపోయి రైతులు అందరూ అప్పులపాలయ్యారు.

- నలుగురు కౌలు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోయారు

- హనుమంతరావు అనే వ్యక్తి మిరప పంట నాశనమైతే ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయలేదు

- దీంతో అతను ప్రభుత్వ అధికారులు, నాయకులు ఆదుకుంటారనే నమ్మకం పోయిందంటున్నాడు

- ప్రభుత్వానికి మానవత్వం లేదు

- రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచింది.

-నేను ఓ రైతుకు సహాయం చేశాను, ఆ రైతు ఏ పార్టీనో నాకు తెలియదు.

-నాయకుడెప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకూడదు

- రైతుకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వమే తీర్చాలి. 

-ముఖ్యమంత్రి గాలిలో తిరిగితే ఎక్కడ ఏ పంట కాలువ తెగిపోయిందో ఎలా తెలుస్తుంది?

- అందరి ముఖాల్లో ఆనందం చూడాలనేదే నా తపన

-నిద్రాహారాలు మాని సేవ చేసేవాడే నాయకుడు

-ప్రభుత్వ వైఫల్యాలు ఒకటి, రెండు కాదు.

-పట్టసీమ ద్వారా నీరు తేలేదు. డ్రైన్లు రిపేరు చేయలేదు, బీమా కట్టలేదు. మూడు తప్పులు.

-ఆలుగడ్ల, ఉల్లి గడ్డ తెలియదు, అహంభావం నర నరాల్లో జీర్ణించుకుపోయింది. 

- అనేక సంవత్సరాలుగా బీమా కట్టకుండా చేశాడు. 

- నష్టపోయిన రైతుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందించివుంటే రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగేది.

- టీడీపీ హయాంలో పత్తి, పొగాకు, చెరుకు ఇలా అన్నింటికి నష్టపరిహారం ఇచ్చాం.

-ఎన్ని లక్షల ఎకరాలు తుపానులో నష్టం వాటిల్లిందంటే సీఎం మాట్లట్లాడలేదు. 

- ఏ పంటకు ఎంత ఇస్తారని అడిగితే చెప్పలేకపోతున్నారు. 

- ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులు మీ తలపై భస్మాసుర హస్తం పెట్టారు. 

- ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన పని ప్రభుత్వాలది.

జగన్ చేసిన తప్పుడు పనుల వల్ల 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం.

- 11  లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు, ఏంచేశాడు?

- రాష్ట్రంలో ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు, 

-రాష్ట్రంలో అభివృద్ధి లేదు,  మతం, కులం కావాలి.

-ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు

-ఉత్తిత్తి బటన్ లు నొక్కుతుంటాడు, ఎవరైనా బటన్ నొక్కగలరు

-వ్యక్తిగతంగా బూతులు మాట్లాడటం నాకు చేతకాదు

- హుందాగా రాజకీయాలు చేయాలి

-ఉపయోగంలేని ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుంటాను

-ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టాలనేదే నా సిద్ధాంతం.

- రాష్ట్రం, మీ పిల్లాలు, మీ భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించి మీ వద్ద ప్రతిపాదన  పెడతాను.

Comments