సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ .

 *సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ *
*ఢిల్లీలో బిజీబిజీగా  రేవంత్ రెడ్డి*


*ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్ లను ఆహ్వానించిన రేవంత్*


*అంతకు ముందు ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ భేటీ*


హైదరాబాద్ (ప్రజా అమరావతి) : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. సీఎంగా ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఆయన కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఈ సందర్భంగా వారిని కోరారు. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ ను సోనియా, రాహుల్ అభినందించారు. అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా రేవంత్ సమావేశమయ్యారు. ఇంకోవైపు, ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి ఈరోజు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్ తిరిగి రానున్నారు.

Comments