వైసీపీలో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి.

అమరావతి (ప్రజా అమరావతి);

తెలుగుదేశం పార్టీలో చేరికల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడి ప్రసంగం వివరాలు

రామచంద్రాపురం, తంబళ్లపల్లి, మంత్రాలయం, కోవూరు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో టీడీపీలో చేరిన వైసీపీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు.

కార్యక్రమంలో చంద్రబాబునాయుడి గారి ప్రసంగం!

• నేడు తెలుగుదేశం పార్టీలో చేరిన వేల మందికి స్వాగతం.. సుస్వాగతం. అందరికీ పేరుపేరునా స్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నాం.

• కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా తమ భవిష్యత్..తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నారు. 

• ఇప్పుడు డిసెంబర్.. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. ఫిబ్రవరి నాటికి సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ ముక్కలుముక్కలవుతుంది. 

• వైసీపీలో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి.


వైసీపీనావకు చిల్లుపడింది. ఒకసారి చిల్లుపడితే ఎవరూ బయటపడే పరిస్థితి ఉండదు. దూకేసిన వారు ప్రాణాలు కాపాడుకుంటారు. దానిలోనే ఉన్నవారు మునిగిపోతారు. 

• ప్రజాస్వామ్యంలో నాయకులు ఎవరైనా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజలసొమ్ముకు ట్రస్టీలుగా ఉండాలి. హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలి.

• ఈ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ల 9 నెలలు అయ్యింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో కూడా తెలియదు.

• ఇన్నేళ్లలో జగన్ ఎప్పుడైనా ప్రజల్ని  కలిశాడా..? వారి దగ్గరగా చేరి వారి కష్టసుఖాలు తెలుసుకున్నాడా? అతను అపరిచితుడు. సొంతపార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడు. అమ్మకు, చెల్లెలికి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడు. బాబాయ్ ను ఏం చేశాడో అందరికీ తెలుసు. 

• ఆత్మగౌరవం  ఉన్నవారు ఎవరూ జగన్ వద్దకు వెళ్లరు. ఈ జగన్మోహన్ రె డ్డి రాష్ట్రంపైకి ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్మమంత్రిబాటలోనే నియంతలుగా మారారు. 

• సొంతపార్టీ ఎంపీ రఘురామరాజుని పోలీస్ కస్టడీలో వేధించాడు. ఎవరైనా ఇలా చేస్తారా? తన పార్టీ ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్టు మార్చేస్తున్నాడు . ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు. అలాంటి వారి గౌరవాన్ని కాపాడటం అంటే ప్రజల గౌరవాన్ని కాపాడటమే. 

• గెలిచినప్పటినుంచీ తన పార్టీ ఎమ్మెల్యేలతో తప్పుడు పనులుచేయించి, ఇప్పుడు వాళ్లను మారుస్తున్నాడు. జగన్ నియోజకవర్గాలు మార్చిన వారిలో 5గురు దళితులే ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలను కూడా బలిచేస్తు న్నాడు.

• పులివెందుల స్థానం బీసీలకు ఇచ్చి, అక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించాకే జగన్ ఆదర్శాలు వల్లెవేయాలి. ఏవో నాలుగు చిల్లర పదవులు దళితులు, బీసీలకు ఇచ్చి, ఉన్నతపదవులు తనవర్గానికి ఇచ్చి, వారిని అక్కున చేర్చుకున్నాడు. ఇదేనా జగన్ చెబుతున్న సామాజికన్యాయం? 

• ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలు, దళితుల్ని బలపరిచినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అమలవుతుంది. 

• సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ముందు మాట్లాడలేరు, మంత్రులు నోరెత్త లేరు, ఎంపీలు గుమాస్తాల కంటే హీనంగా తయారయ్యారు. ఇవన్నీ చూశాక జగన్ రెడ్డి 151 మందిని మార్చినా తన ప్రభుత్వం రాదు. గెలిచే ప్రసక్తే లేదు. 

• రేపు జరగబోయే ఎన్నికలు నేను ముఖ్యమంత్రిని కావడానికి కాదు. టీడీపీ – జనసేన పార్టీలు గెలవడానికి కాదు. రాష్ట్ర భవిష్యత్ ను కాపాడు కునే ఎన్నికలు. మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ కాపాడుకునే ఎన్నికలు.  ఈ విషయం ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించుకోవాలి. 

• తెలుగుదేశానికి అధికారం.. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. జనసేన తో కలిసి టీడీపీ ముందుకురావడానికి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసమే. 

• రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లు కొనసాగి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది. ప్రజల జీవనప్రమాణాలు పెరిగేవి. 

• ప్రభుత్వం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి భవిష్యత్ కు దారిచూపాలి. కానీ ఈ ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకుంటోంది. 

ఈ  ముఖ్యమంత్రి  ఎన్నికలకు ముందు  ఏం చెప్పాడు.. అధికారంలోకి  వచ్చాక ఏం చేశాడు? పది ప్రశ్నలు వేస్తున్నాను.. వాటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

1. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు .. తీసుకొచ్చాడా? 22 మంది ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులతో 31 మంది ఎంపీలు జగన్ తో ఉన్నారు. కానీ ప్రత్యేకహోదా తెచ్చాడా? మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేతలు గడపకూడా దాటడం లేదు. 

2. పోలవరం నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పాడు..చేశాడా? రాష్ట్రం సస్యశ్యా మలం కావాలంటే పోలవరం ప్రాజెక్టే మనకు దిక్కు.  టీడీపీ ప్రభుత్వం లో 72 శాతం పోలవరం పూర్తిచేశాం. మరలా అధికారంలోకి వచ్చి ఉంటే 2020కి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేసేవాళ్లం. 2020కి పూర్తి కావాల్సిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థి తి. తెలుగుజాతికోసం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను గాలికి వదిలేశారు. నేను కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని రైతులకు ఇవ్వకుండా జగన్ రెడ్డి జాతి ద్రోహానికి పాల్పడ్డాడు. 

3. ఎన్నికలకు ముందు ఏటా జనవరిలో  జాబ్ క్యాలెండర్ అన్నాడు.. ఇప్పటివరకు ఒక్కరికైనా ఉద్యోగమిచ్చాడా? దేశంలోనే ఎక్కువమంది నిరుద్యోగులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపాడు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లో 11 డీఎస్సీలు పెట్టి, లక్షా50వేల మంది ఉపాధ్యాయులను సమైక్య రాష్ట్రంలో, విభజనానంతర రాష్ట్రంలో నియమించాం. టీచర్లను నియమించలేదు..ఉన్నస్కూళ్లు మూసేశారు. ఇదీ  వీళ్లు సాధించింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి.. వారికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అందిస్తున్నాడు. ఇన్నేళ్లలో గంజాయి..మాదకద్రవ్యాలపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. రాష్ట్రంలో గంజాయి పంట సమృద్ధిగా సాగవుతోంది. 

4. మద్యపాన నిషేధం అన్నాడు.. చేశాకే ఓట్లు అడుగుతాను అన్నాడు. దాన్ని ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్ప టి నుంచీ పేదల ఆరోగ్యంతో ఆడుకుంటూ నాసిరకం మద్యం అమ్ముతూ దోచుకుంటున్నాడు. ఆడబిడ్డల మాంగల్యాలు తెంచుతున్నాడు. 

5. వారంలో సీపీఎస్ రద్దు చేస్తాను అన్నాడు. ఎన్ని వారాలు అయ్యాయి.. ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి. 

6. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టీడీపీప్రభు త్వంలో  వారికి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాము. నేడు జగన్ రెడ్డి వారు రోడ్లెక్కితే, అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తున్నా డు. టీడీపీ ప్రభుత్వం రాగానే అంగన్ వాడీ సిబ్బందికి న్యాయం చేస్తాం.

7. టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమలుచేస్తే కావాలని విమర్శలు చేశాడు. ఇప్పుడు అదే ఇసుకను అమ్ముకుంటూ భారీ దోపిడీ చేస్తున్నాడు. నేడు ట్రాక్టర్ఇసుకను రూ.5, 6వేలకు అమ్ముతున్నాడు. దాదాపు రూ.40వేలకోట్లు కేవలం ఇసుకలోనే దోచేశాడు. 

8. ప్రజా రాజధాని అమరావతి ఏమైంది? ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అనిచెప్పి మాట తప్పాడా..లేదా? సిగ్గులేకుండా మనం కట్టించిన భవనాల్లోనే ఉండి పాలన చేస్తున్నాడు. రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం లేదు. ఈ దుర్మార్గుడు సమైక్య రాష్ట్రంలో 2004లోనే ముఖ్యమంత్రి అయ్యి ఉంటే హైటెక్ సిటీ సహా హైదరాబాద్ కూడా మిగిలేది కాదు. జాతకం బాగుండి.. ఈయన తండ్రి ముఖ్యమంత్రి అయ్యా డు. అమరావతి నిర్మాణం పూర్తై ఉంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోయేవి .. పిల్లలకు మంచి భవిష్యత్ అందేది.  

9. మరోపక్క బాదుడే బాదుడని అప్పుడు కూనిరాగాలు తీశాడు. చివరకు ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పెట్రోల్..డీజిల్ సహా గ్యాస్ ధరలు పెంచాడు. ఆఖరికి చెత్తపై కూడా పన్నువేసిన చెత్త ముఖ్య మంత్రిగా నిలిచాడు. 

10. టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఎక్కడైనా రోడ్డు వేశాడా? గ్రామాల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశాడా? రైతులు ఆనందంగా ఉన్నారా? దేశంలో ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపాడు. రైతులపై ఎక్కువ అప్పులున్న రాష్ట్రం కూడా మనదే. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? పోలీసులు లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ బయటకురాలేని పరిస్థితి.  ముఖ్యమంత్రికూడా పరదాలు కట్టుకునే బయటకు వస్తున్నాడు.

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు..ఇదీ జగన్ నైజం

సర్వేల పేరుతో భూముల్ని ఆక్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి సహా వైసీపీనేతలు ప్రజల భూములు.. చివరకు దేవుడి భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. 

ఆడుదాం ఆంధ్రా అంటూ తనపార్టీ ఎమ్మెల్యేలతో ఆడుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎలా నమ్మాలి? అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు. ఇలాంటి వ్యక్తులు ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించుకోవాలి. మొన్నటికి మొన్న గుంటూరులో మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ , సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కారణం ముఖ్యమంత్రేనని లేఖరాసి మరీ చనిపోయాడు. వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక కర్నూలు జిల్లా అమృతపురంలో వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక పరుశురామ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయి. మంత్రులు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతుంటే, వైసీపీ ఎమ్మెల్యేలు ఆంబోతుల్లా రాష్ట్రంపై పడ్డారు. ఇవన్నీ ఆలోచించాలి. 

టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసు. మరలా అధికా రంలోకి వస్తే ఏంచేయాలో అవన్నీ చేస్తాం.  ఇప్ప్పటికే బాబుష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నాం.  20వ తేదీ  తర్వాత నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. ప్రజల్ని కలిసి వారికేం కావాలో ఆలోచించి మరిన్ని హామీలు ఇస్తాం.” అని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.


*పార్టీలో చేరిన వారి వివరాలు*

రామచంద్రాపురం, తాడికొండ, తంబళ్లపల్లి, ఉదయగిరి, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరిక.

6 నియోజకవర్గాల నుంచి దాదాపు 4500 మంది ద్వితియ శ్రేణి నేతల చేరిక

1. తాడికొండ నియోజకవర్గం :- ఎమ్మెల్యే శ్రీదేవి  అనుచరులు 500 మంది చేరిక.

2. రామచంద్రపురం నియోజకవర్గం:- టీడీపీ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో 450 మంది పార్టీలో చేరిక. వీరిలో వివిధ పార్టీలకు చెందిన మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, యూత్ లీడర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు.

3. ఉదయగిరి నియోజకవర్గం:- ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి  అనుచరులు సుమారు 100 మంది పార్టీలో చేరుతున్నారు. వారి వివరాలు. స్వయంపాకుల శాంత కుమారి, వైసీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి, వైసీపీ జిల్లా కార్యదర్శి వర్ర చిన్న బ్రహ్మాయ్య, దుత్తలూరు మండలం వైసిపి యూత్ అధ్యక్షుడు కంభం రఘునాధ్ రెడ్డి. వ్యాపారులు పర్చూరి సుబ్బారావు, మాజీ ఎంపిటిసీ జి. రమణయ్య, సీనియర్ నేతలు కలవకూరి నరసింహారావు, మల్లినేని రమణయ్య, వైసిపి ఎస్సీ సెల్ లీడర్ చేవూరి రవితేజ  ఉన్నారు.

4. తంబళ్లపల్లి నియోజకవర్గం: ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్ర రెడ్డి తో పాటు 2 వేల మంది టీడీపీలో చేరిక.

5. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం:- ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ భూదేటి రాధయ్య టీడీపీలో చేరిక.

అలాగే కొవూరు టీడీపీ ఇంఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేరికలు. కరేటి శ్రీనివాస్, చేవురి రాంప్రసాద్, నంద కుమార్, గుమ్మా సుధాకర్ వంటి నేతలు పార్టీలో చేరుతున్నారు.

6.మంత్రాలయం నియోజకవర్గం:- మాజీ కేడీసీసీ చైర్మన్ మాధవరం రామిరెడ్డి(దివంగత) కుమారులు పార్టీలో చేరిక. రామిరెడ్డి గారి కుమారులు...నల్లగోని రాఘవేంద్రరెడ్డితో పాటు అతని సోదరులు రఘనాధ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, రాజా రెడ్డి పార్టీలో చేరుతున్నారు. వీరితో పాటు సుమారు 1500 మంది పైగా వైసీపీ నాయకులు&కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు.

మాధవరం సర్పంచ్ యాకోబు, మాధవరం ఎంపీటీసీ : K. ఈరన్న, ఉరుకుంద ఎంపీటీసీ పోతులయ్య,  రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు మాజీ మెంబెర్ చిరంజీవి, పలువురు వార్డు మెంబర్లు పార్టీలో చేరారు.

Comments