రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి.

 రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి



గుంటూరు (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించడం వలన రాష్ట్రవ్యాప్తంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలను పూర్తిగా నష్టపోయారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుమారస్వామి తెలియజేశారు. రాష్ట్రంలో రాష్ట్ర గిడ్డంగుల్లో 67% కేంద్ర గడ్డింగుల్లో 54 శాతం ఖాళీలు ఉండగా రైతులకు మాత్రం ఆ గిడ్డలను ఇవ్వకుండా రైతులను పలు రకాల ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు లక్షల ఎకరాల్లో పంట రోడ్డును పడి ఉన్నదని ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరి రైతులకు వెంటనే ప్రభుత్వ గిడ్డంగల్లో స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుమార్ స్వామి డిమాండ్ చేశారు. రాయలసీమలో ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతినగా, కోస్తా జిల్లాల్లో వరి, ప్రత్తి, మిరప, పొగాకు, ఉద్యానవన పంటలు నీటిలో తెలియాడుతున్నాయని, కోనసీమలో కొబ్బరి తోటలు, ఉత్తరాంధ్రలో జీడి తోటలు, చెరకు, తదితర పంటల వలన రైతులు పూర్తిగా నష్టపోయారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు మరియు ఇతర పంటలు నష్టపోయినా ప్రభుత్వం స్పందన మాత్రం నామమాత్రంగా ఉందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం శాఖ గత 15 రోజులుగా హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందాని అన్నారు.  కల్లాలలో ధాన్యం కొనుగోలు కోసం రైతులు బ్రతిమిలాడుతున్న  ప్రభుత్వం మాత్రం కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పొలాల్లో తేలియాడే వరి పైరును చూస్తూ రైతులు ఆవేదన అనుభవిస్తుంటే, ప్రజా ప్రతినిధులు మాత్రం రైతు దగ్గరకు వచ్చి భరోసా కల్పించిన పరిస్థితి లేదని అన్నారు. అరటి, బొప్పాయి నేలవాలగా, ప్రత్తి, మిరప, పొగాకు చేపల చెరువులు ఇతర పంటలు లక్షల ఎకరాల్లో రైతులు కోట్లలో పూర్తిగా నష్టపోయినా,  ప్రభుత్వంమాత్రం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రైతులకు హామీలు ఇవ్వడం తప్ప ఎన్నడు అమలు చేసిన దాఖలాలు లేవని, వెంటనే పంట నష్టాన్ని మదింపు చేసి వరికి ఎకరానికి 30,000, ప్రతి మిరప, పొగాకు పంటలకు 40 వేల రూపాయలు, ఉద్యానవన పంటలకు 50 వేల రూపాయలు, ఇతర పంటలకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి డిమాండ్ చేశారు. నష్టాన్ని యుద్ధప్రాతిపదికన అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుమారస్వామి కోరారు. రైతులను మోసం చేసే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ కిసాన్ మోర్చా ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, రైతుల తరఫున నిత్యం పోరాదుతుందని చిగురుపాటి కుమార్ స్వామి రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు  జయప్రకాష్ నారాయణ, 

జిల్లా ప్రధాన కార్యదర్సులు చరకా కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతి రావు, వై.వి.సుబ్బారావు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండు రంగ విఠల్, జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రి సుగుణ, జిల్లా కార్యదర్శి లక్ష్మీ, కిసాన్ మోర్చా మార్కెట్ యార్డ్ సెల్ రాయ నాగేశ్వరరావు, దేసు సత్యనారాయణ, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

Comments