విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది.


పాతనందాయపాలెం, బాపట్ల జిల్లా (ప్రజా అమరావతి);


*తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా బాధితులతో సీఎం శ్రీ వైయస్ జగన్ ముఖాముఖి.. అనంతరం సీఎం కామెంట్స్*


- ఇంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోంది.

- ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా కచ్చితంగా చెబుతున్నా. 

- ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నా. 

- ఈరోజు ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాలో సందర్శించాను. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. 

- ఈ తుపాను తిరుపతి నుంచి మొదలుపెడితే సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు. 

- విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది. - దాని వల్ల వాటర్ లాగింగ్ జరిగి ఇబ్బందులు పడ్డాం.


- మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. 

- ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకొని నడిపించి సహాయం చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. 

- వివక్షకు తావుండదు. నష్టం ఎవరికి జరిగినా కూడా, చివరికి మనకు ఓటు వేయని వారికి జరిగినా ఈ ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది. 

- ట్రాన్స్‌పరెంట్‌గా నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్ ఆడిట్‌కు పేర్లు పెట్టడం జరుగుతోంది. 

- పొరపాటు జరిగి ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలని లిస్టులు డిస్‌ప్లే చేసి మరీ సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది.

- ఇంతకు ముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవు. 

- గతంలో ఏరోజు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందో తెలియదు, ఎంత మందికి వస్తుందో తెలియదు. 


- ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పరిపాలనలో పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితి కనిపిస్తోంది. 

- నీళ్లతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకొనేందుకు, వాళ్లకు ఇవ్వాల్సిన రేషన్ తోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. 

- ఇప్పటికే రేషన్, రూ.2,500 ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం పూర్తవుతుంది. 

- దాదాపు 12 వేల మందికి, వారికి ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.2చ500 ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 

- ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 


- రెండోది.. పంట నష్టానికి సంబంధించి.. ప్రతి రైతన్నకు ఒకటే చెప్పదల్చుకున్నా. 

- ఎవరైనా మీకు ఇన్ పుట్ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే దయచేసి నమ్మవద్దండి. 

- ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగదు అనేది గుర్తు పెట్టుకోవాలి. 

- మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు. 

- పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలనే నిజం చేయాలని, అబద్ధాలనే పనిగట్టుకొని చూపించేవాళ్లు, రాసేవాళ్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. 

- ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. 


- ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు. 

- ఈ ఖరీఫ్ సీజన్‌లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చినది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే.

- ఈ ఖరీఫ్ సీజన్‌కు ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? వచ్చే ఖరీఫ్ మొదలయ్యేనాటికి. 

- జూన్‌కు రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

- ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు. 

- అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈక్రాప్ చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా ఈ క్రాప్‌లోకి నమోదు చేసి రైతు తరఫున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే. 


- గతంలో చంద్రబాబు పాలనలో మీకు గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లూ వరుసగా కరువు కాటకాలే. 

- అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అంటే.. కేవలం 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు. 

- అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో దేవుడి దయ వల్ల ఎక్కడా కరువు కాటకాలు ఏమీ లేకపోయినా కూడా రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంలో బాగుపడినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినది 55 లక్షల మందికి రూ.7,800 కోట్లు.

- బాబు హయాంలో ఎక్కడ 3400 కోట్లు? మీ బిడ్డ హయాంలో ఎక్కడ 7800 కోట్లు?

- చంద్రబాబు ఐదు సంవత్సరాల లెక్కలు, మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల లెక్కలే చెబుతున్నా. 


- ఏ సంవత్సరం అయినా ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే, వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూరెన్స్ కచ్చితంగా వస్తోంది. 

- ఇన్ పుట్ సబ్సిడీ కూడా దేశంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్ లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం.  

- వెంటనే కలెక్టర్లు అందరూ స్పందిస్తున్నారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం రేపో మరునాడో మొదలు పెడతారు. 

- కలెక్టర్లు ఎన్యుమరేషన్ పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత 15 రోజులపాటు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తారు. 

- గ్రామ సచివాలయంలో ఎవరైనా రైతు మిస్ అయితే, మీరు పేరు చూసుకోండి.. పొరపాటున మిస్ అయి ఉంటే మళ్లీ అవకాశం ఇస్తున్నాం, మళ్లీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసి మీకు వచ్చేట్టుగా చేస్తామని సమయం ఇస్తారు. 


- వచ్చే నెలా సంక్రాంతి లోపు మీ అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది. 

- ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నాం. 

- విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచి సప్లయ్ చేస్తూ వెంటనే ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- మీ అందరితో విన్నవించేది ఒక్కటే దయచేసి అపోహలు నమ్మొద్దు. 

- మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దండి. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దండి. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు. 

- కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించాలి, ఆ మనిషిని తీసుకొచ్చేయాలని దురుద్దేశంతో కావాలనే అబద్ధాలాడుతున్నారు. 

- ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని కోరుతున్నా. 


- కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. 

- మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నష్టం, ఇబ్బంది జరిగినా కచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి తీసుకొచ్చాం.

- సోషల్ ఆడిట్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తెచ్చి, కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజేషన్ చేసి, 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి, జేసీల సంఖ్యను డబుల్ చేసి, సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం.

- ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ నేను రావాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు. 

- ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా అది. 


- మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు. 

- మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత నేనే వచ్చి ప్రజలను అడుగుతా. నేనొచ్చి అడిగినప్పుడు మా కలెక్టర్ బాగా పని చేశాడు, గొప్పగా పని చేశాడనే మాట ప్రజల నుంచి రావాలి అని చెప్పాను. 

- ఇంతకు ముందు చంద్రబాబు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. టీఆర్27కు అర్థమే చంద్రబాబుకు తెలియదు. 

- కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి, వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సఫిషియంట్ టైమ్ ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేందుకు మీ బిడ్డ వారం తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు, ప్రజలను అడుగుతాడు అని చెప్పినప్పుడు కలెక్టర్లు, సచివాలయాలు, ఎమ్మార్వోలు, వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగెత్తి ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. 


- జరిగిన నష్టం అపారమైనది, కాదని నేను అనను, జరగాల్సిన, చేయాల్సిన సహాయం అంతా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. వేగంగా జరుగుతుంది.

- గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా జరుగుతుంది. 

- ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. 

- ఇక టెంపరరీ డామేజ్‌లకు సంబంధించి, రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇటువంటి వాటికి సంబంధించి ఎలాగూ జరుగుతాయి.

- వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రిలీఫ్ గా చేయాల్సినవన్నీ ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాం.

- పర్మినెంట్‌గా రెగ్యులర్‌గా చేయాల్సిన పనులు కూడా టేకప్ చేసే కార్యక్రమాలు చేస్తాం. 

- మీ అందరి ఆప్యాయతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ.
Image
వైసీపీలో తిరుగుబాటు...జగన్ కు త్వరలో భంగపాటు.
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image