ముఖ్యమంత్రి ఆపన్న హస్తం కోరిన వెంటనే మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం. *ఆర్థిక సాయం కొరకు  ముఖ్యమంత్రి ఆపన్న హస్తం కోరిన వెంటనే మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం


అందించాలని కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి* 


 *ఇరువురికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన జిల్లా యంత్రాంగం* 


 వాకాడు,డిసెంబర్  08 (ప్రజా అమరావతి): మిచౌంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్ట పోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం పర్యటనలో ముఖ్యమంత్రిని ఆర్థిక సాయం కోరిన ఇరువురు మహిళలకు వెంటనే మానవత్వంతో స్పందించిన ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించగా ఇరువురికి లక్ష చొప్పున జిల్లా యంత్రాంగం తరపున ఆర్థిక సాయం అందించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ. ఆర్థిక సాయం అందిన వారిలో

1) పి.రమణమ్మ 51సం. లు, w/o  లేట్ గోపాలయ్య   కుటుంబ యజమాని మరణించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిలేదని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా సత్వరమే స్పందించిన సిఎం గారు తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డిని ఆర్థిక సాయాన్ని అందచేయాలని ఆదేశించారు.


2. ఐ. కవిత D/o  లేట్  భాస్కర్  కుటుంబ యజమాని మరణించడంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిలేదని ఆదుకోవాలని గౌ.ముఖ్యమంత్రి కి విన్నవించగా సిఎం గారు తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించిన నేపథ్యంలో వారి సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజి సదరు ఇరువురు మహిళలకు  లక్ష  రూపాయల వంతున  చెక్కులను అందచేశారు.

Comments