ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకోవాలి.

 *దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో దెబ్బతిన్న పొంట పొలాలను పరిశీలించిన కమిటీ సభ్యులు*


*తుఫాన్ కంటే జగన్ చేతకాని తనంతోనే పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది*


*నియోజకవర్గంలో 90 శాతం పంటలు దెబ్బతిన్నాయి*


*ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకోవాలి


*


*ఈక్రాప్‌తో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలి*


దుగ్గిరాల, డిసెంబరు 11 (ప్రజా అమరావతి): తుఫాన్‌ ప్రభావంతో నియోజకవర్గంలో వరి చేలన్నీ వర్షపు నీటిలో నానుతున్నాయని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నియమించిన కమిటీ సభ్యులైన మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిరాల ఇమ్మానుయేల్, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షులు మరీదు శివనాగేశ్వరరావులు సోమవారం దుగ్గిరాల మండలంలోని ఈమని, శృంగారపురం, పెదపాలెం, మోరంపూడి, పేరుకలపూడి, చుక్కపల్లివారిపాలెం, తాడేపల్లి మండలం చిర్రావూరు తదితర గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు, రైతు సంఘం నాయకులతో కలిసి దెబ్బతిన్న అరిటి, వరిపంట పొలాలను పరిశీలించారు. నీట మునిగిన పొలాల్లో దిగి, ఎంతమేరకు నష్టం జరిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తుఫాన్ కంటే జగన్ చేతకానితనం, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్లే రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. నియోజకవర్గంలో 90 శాతం వరి పంట పూర్తిగా ధ్వంసమైందన్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌పై వారం ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా జగన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం మిన్నకున్నాయన్నారు. నేటికీ చేలల్లో నీరు బయటకు పోలేదన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు, సాగునీరు అందించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం వ్యవసాయయాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ పరికరాలతో పాటు టార్పాలిన్లు రాయితీపై అందిస్తే, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా రాయితీపై ఒక్క పరికరం కాదుకదా.. పరదా కూడా అందించలేదన్నారు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వేళ పంటలు కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. పంటకాల్వలు మరమ్మతులకు నోచక గుర్రపుడెక్క, తూటుకాడ వ్యర్ధాలతో డ్రెయిన్లు పూడుకుపోయి దర్శనమిస్తున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పొలాల్లో నీరు వెలుపలికి మార్గం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. తుఫాన్ వల్ల ప్రతి రైతు రూ. 50 నుంచి రూ. 60 వేల వరకు నష్టపోయినట్లు తెలిపారు. మునిగిన పంటను బయటకు తీయాలంటే రూ. 20 వేలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఇకనైన రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు స్పేషల్ జీవో జారీ చేసి పంట నష్టానికి ఎకరానికి రూ.30 అందించినట్లు గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.30 వేలను రూ. 20 వేలకు తగ్గించారు. అది కూడా ఏవరికి ఇచ్చారన్న దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో పంటల నష్టాన్ని అంచనా వేసి జాతీయ అధ్యక్షులు చద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళతామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనావేసి ఈక్రాప్‌తో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. 


ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళ అశోక్ కుమార్ యాదవ్, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, తాడేపల్లి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, నియోజకవర్గ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శ్రీనివాసరావు, దుగ్గిరాల మండలం తెలుగురైతు సంఘం అధ్యక్షుడు నందిపాటి జోగారావు, జిల్లా రైతు సంఘం సభ్యులు వాసిరెడ్డి సుధాకర్,  మండల కమిటీ సభ్యులు భుజంగరావు, పెదపాలెం ఎంపీటీసీ పుతుంబాక సాయి కృష్ణ, ఈమని గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు, చుక్కపల్లివారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కచెంర్ల మోహనరావు, పేరుకలపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడు గోగం నాగేశ్వరరావు, పెదపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నంబూరి యాకోబు, శృంగారపురం గ్రామ పార్టీ అధ్యక్షులు యలవర్తి అంకమయ్య, చిర్రావూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరిశెట్టి శ్రీనివాసరావు, పాతూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్, చిర్రావూరు గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పోకల శివయ్య, ప్రాతూరు రాజేష్, మన్నవ అశోక్, గండు కోటి యాదవ్, కాసరనేని కృష్ణ, మువ్వా చంద్రశేఖర్, రవికాంత్, ఆకుతోట శంకర్, జనార్థన్, పసుపులేటి వరదరాజు, వీరంకి సాంబశివరావు, కావూరి రాకేష్, మారుమాక రాజేష్, నన్నపనేని అర్జున్, మానేపల్లి కిరణ్, మొక్కపాటి రవి, వెలివోలు కిరణ్, పొకల శ్రీనివాసరావు, యాదిగిరి శ్రీనివాసరావు, బచ్చా వెంకటేశ్వరావు, పొకల కొండయ్య, అగరంశెట్టి రాజా, హరి, రాజేష్, సునీల్, కోటేశ్వరరావు, చిన్ని, మైల చిన్న, ద్వారక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments