వ్యర్థాలను మురుగు కాల్వలలో వేయవద్దు.

   తెనాలి (ప్రజా అమరావతి);

వ్యర్థాలను  మురుగు కాల్వలలో వేయవద్దుఇళ్ళయజమానులు  షాపులవారు తమ వ్యర్ధాలను బయట పారవేయవద్దని వాటిని తమ మునిసిపల్ సిబ్బంది వచ్చినపుడు అందించాలని తెనాలి ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ అన్నారు.  రోజూ వారిగా పారిశుథ్యపనుల పర్యవేక్షణ లో భాగాంగా శుక్రవారం 23వ వార్డులో  ని చంద్రబాబు నాయుడు కాలనీ  ఆటో సెంటర్ లో డ్రైనేజి కాల్వల పనితీరుచూసి పేరుకొన్న సిల్టు ఇతర వ్యర్థాలను తొలగింప చేసి మురుగు నీరు సాఫీగా పారే విథంగా చేశారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య  , వైకాపా నాయకులు తాడిబోయిన రమేష్, శానిటరీ  ఇన్సెక్టర్  లక్ష్మీనారాయణ ప్రభృతులు పాల్గొన్నారు

Comments