నూతన ఫీచర్లతో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం


అమరావతి. (ప్రజా అమరావతి);

                                                                                                                                                                                                            *రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం (15–12–2023)  సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి  శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ……*

                                                                          

# ఈనెల 18న నూతన ఫీచర్లతో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం


డిసెంబర్‌ 19న క్షేత్రస్థాయిలో ప్రారంభం.

ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 


వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం.

పేదవాడికి ఉచితంగా రూ.25 లక్షల వరకూ వైద్యం: సీఎం

కేన్సర్‌ వంటి అనేక ప్రొసీజర్లలో ఇప్పటికే లిమిట్‌ లేకుండా వైద్యం అందిస్తున్నాం: సీఎం

కేన్సర్‌ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్‌పై గత నాలుగేళ్లలో రూ. 1897 కోట్లకు పైగా వ్యయం చేసిన ప్రభుత్వం.


ఆరోగ్యశ్రీ పై ఈ ఏడాది రూ.4,400 కోట్ల వ్యయం చేస్తున్న ప్రభుత్వం.

గత ప్రభుత్వంలో దీనిపై ఏటా రూ.1000 కోట్లు మాత్రమే ఖర్చు. 

ఆరోగ్య శ్రీ కార్డుతో ఆస్పత్రికి వెళ్తే చాలు రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం: సీఎం

ఆరోగ్య శ్రీలో ఇది అతిపెద్ద మైలు రాయి: సీఎం


వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విçస్తృత చర్చ.

ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం.


ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ, ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్న దానిపై విస్తృతంగా ప్రచారం కార్యక్రమం.

వైయస్సార్‌ ఆరోగ్య శ్రీని సమగ్రంగా వివరిస్తూ చక్కటి బ్రోచర్‌ను ఇవ్వనున్న ఆరోగ్య సిబ్బంది.

ఈ ప్రచార కార్యక్రమం తర్వాత ఆరోగ్య శ్రీ కింద ఎలా ఉచితంగా చికిత్స పొందాలన్నదానిపై ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదు.

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల దగ్గరనుంచి ప్రతి అంశంపైనా అవగాహన ఉండాలి.

ఆరోగ్య శ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్‌ ద్వారానే కాకుండా, 104 కాల్‌ సెంటర్‌ ద్వారా, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా, 108 అంబులెన్స్‌ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా స్థానిక పీహెచ్‌సీల ద్వారా ఎలా ఉచితంగా వైద్యం అందుకోవచ్చన్నదానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.


ప్రజాప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు, భావసారూప్యత ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

తర్వాత ప్రతిమండలంలో వారంలో నాలుగు గ్రామాలు చొప్పున ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

దాదాపు జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది.

ఆరోగ్య శ్రీపై ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్‌  చేస్తారు.

అదే సమయంలో దిశ యాప్‌కూడా ఉందా లేదా పరిశీలించి లేకపోతే దాన్ని కూడా డౌన్లోడ్‌ చేస్తారు.

ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించి చికిత్స పొందుతున్న వారికి సరిగ్గా మందులు అందుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి వారికి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి.

ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకుని తిరిగి డాక్టర్‌ చెకప్‌ కోసం వెళ్లాల్సి వస్తే రవాణా ఖర్చుల కింద రూ.300లు చెల్లించనున్న ప్రభుత్వం.

డాక్టర్‌ చెకప్‌ కోసం పదిరోజుల ముందే సంబంధిత ఏఎన్‌ఎంకు అలర్ట్స్‌.


ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుంచి

ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించిన రోగులకు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.

విలేజ్‌ క్లినిక్స్‌కు చేరవేసిన తర్వాత ఏఎన్‌ఎంలు అందిస్తారు.

మందులు అయిపోయిన తర్వాత వెంటనే ఇండెంట్‌ ఆన్లైన్‌లోనే సమాచారం.

ఆ మేరకు మందులు పంపిణీ... వెంటనే డోర్‌ డెలివరీ చేస్తారు

చికిత్సలో భాగంగా మందులు అయిపోయిన తర్వాత వాటికోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

మందుల పంపిణీకోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌తో టై అప్‌.

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పోస్టల్‌ ద్వారా విలేజ్‌ క్లినిక్‌కు మందులు. 

అక్కడ నుంచి రోగులకు మందులు పంపిణీ.

ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి సమర్థవంతమైన ఎస్‌ఓపీని తయారు చేశారు.

ఇచ్చే మందులు కూడా అంత్యంత నాణ్యమైన మందులు. 

డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు రోగులకు అందిస్తున్నాం.


సూపర్‌ స్పెషాల్టీ సేవలందించే వైద్యులకు రూ.4లక్షవరకూ జీతాలు ఇస్తున్నాం.

ఎక్కడా ఖాళీలు ఉన్నా దాదాపుగా భర్తీచేశారు :


*ఇతర వివరాలు:*

90 శాతం కుటుంబాలకు వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను పొందేందుకు అర్హులు.

ఏడాది ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది.

వేయి రూపాయలకుపైగా ఖర్చయ్యే చికిత్సలన్నీకూడా వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ పరిధిలోకి.

3,257 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీ వర్తింపు.

ఇప్పటికే  క్యాన్సర్‌ రోగులకు పరిమితి లేకుండా చికిత్సలు అందిస్తున్నాం.


ఇప్పటివరకూ 53,02,816 మంది ఆరోగ్య శ్రీకింద చికిత్స.

రూ. 11,859.86 కోట్లు ఈ ప్రభుత్వ హయాంలో ఖర్చు.



# కడప ప్రభుత్వ వైద్యకళాశాలలో 300 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో పేదలకు మరింత మెరుగైన, అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టుల భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.


# గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్‌ నర్స్, నర్సింగ్‌ సూపరింటెండ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.



# వైద్య ఆరోగ్యరంగంలో మరో కీలక నిర్ణయం.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 పాత వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు ఏర్పాటుకు ఆమోదం.

ప్రైయివేటు ఆస్పత్రులకు ధీటుగా ఈ విభాగాల్లో పేదలకు అందనున్న వైద్య సేవలు.

మార్కాపురంలో కూడా ఇవే సేవలందించేందుకు సంబంధిత విభాగాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 

287 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.



# విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీలలో గైనిక్, పీడియాట్రిక్, అనస్థీసియా విభాగాల్లో 95 పోస్టుల భర్తీ చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించిన మంత్రిమండలి.



# విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)ను 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించిన మంత్రిమండలి.



# రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సలో మెరుగైన, అత్యాధునిక చికిత్స అందించేందుకు కొత్తగా కేన్సర్‌ విభాగాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించిన మంత్రిమండలి.

ఏడు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో( శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం) కేన్సర్‌ (ఆంకాలజీ– రేడియేషన్, సర్జికల్, మెడికల్‌ ఆంకాలజీ) విభాగాన్ని 64 పోస్టులతో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించిన మంత్రిమండలి. 



# డిసెంబరు 21 తేదీన 8వతరగతి చదువుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్ధులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం.

రూ.638 కోట్ల వ్యయంతో 4 లక్షల 35 వేల ట్యాబుల పంపిణీ.

6 వతరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతిగదిలోనూ ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌( ఐఎఫ్‌పీ) చొప్పున 62వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు.

గతంతో పోల్చితే మరింత మెరుగైన ట్యాబ్‌ కెఫాసిటీ.

విదేశీ భాషలునేర్చుకునేందుకు వీలుగా డ్యుయో లింగో యాప్‌. 

విద్యార్ధుల సందేహాల నివారణ కోసం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌.

డిసెంబరు 21 నుంచి 31 వ తేదీ వరకు ట్యాబుల పంపిణీ. 



# జనవరి 10 నుంచి 23 వరకూ వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం.

ఆసరా కింద ఇప్పటికే 78.81 లక్షల మందికి రూ.19,165.28 కోట్ల పంపిణీ.

చివరి విడత అయిన నాలుగో విడతలో రూ.6,394 కోట్ల పంపిణీ.



జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజవర్గంలో మండల స్ధాయిలో వైఎస్సార్‌ ఆసరా నాలుగవ విడత విడుదల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలతో నిర్వహించనున్నారు. 



# జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాలు.

10 రోజుల పాటు చేయూత కార్యక్రమం. 

పేద అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్‌ చేయూత.

దేశంలో ఎక్కడా, గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం చేపట్టిన అక్కచెల్లెమ్మలకు చేయూత కార్యక్రమం ద్వారా జీవనోపాధి కల్పన. 

45 ఏళ్ల నిండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ.. వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ.. వైయస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750ల చొప్పున వరుసగా నాలుగేళ్లు అండగా నిలబడ్డ ప్రభుత్వం.



# పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.

అవ్వా తాతలు, వితంతవులు, ఒంటరి  మహిళలు, చేనేత, కళ్లు గీత కార్మికులు, చర్మకారులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులకు అందించే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ప్రస్తుతం అందిస్తున్న రూ.2,750 నుంచి రూ.3000కు పెరగనున్న సామాజిక పెన్షన్‌.

పెంచిన పెన్షన్‌ వలన ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.2,000 కోట్లు వ్యయం.

గత ప్రభుత్వంలో వెచ్చించింది  నెలకు  కేవలం రూ.400 కోట్లు మాత్రమే. 

డిసెంబరులో పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని జనవరి 1 తేదీ నుంచి జనవరి 8వ తేదీ  2024 వరకు  65,33,781 మంది పెన్షన్‌ దారులకు అందజేయనున్నారు.

 

జనవరి 1 నుంచి జనవరి 8 వరకు 8 రోజుల పాటు పెన్షన్‌ పెంపు కార్యక్రమాలు.

పాల్గొననున్న ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు.

పండుగ వాతావరణంలో పెన్షన్‌ పెంచి ఇచ్చే కార్యక్రమం.



# రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 26 రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాల్లో వివిధ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు, డెలివరీ మెకానిజమ్‌ను పటిష్టపరిచే చర్యల్లో భాగంగా 26 డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.



# జలజీవన్‌ మిషన్‌ కింద గ్రామ జలసంఘం కమిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 

గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం.

తాగునీరు పథకాల కోసం ప్రణాళిక అమలు, నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించనున్న కమిటీలు. 

ఆమోదం తెలిపిన మంత్రిమండలి.



# శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో  గురుకుల పాఠశాల నుంచి అప్‌గ్రేడ్‌ అయిన మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ బీసీ వెల్ఫేర్‌ మహిళా గురుకుల కళాశాలలో రెగ్యులగ్‌ విధానంలో 2, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 6 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.



# గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాలల్లో 251 ( తెలుగు భాషాపండితులు 98, హిందీ భాషా పండితులు 93, పిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనింగ్‌ టీచర్స్‌ 60) పోస్టులను అప్‌గ్రెడేషన్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 



# పిఫ్త్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ విధులు సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన 10 పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి.  



# యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నవారికి అందించే యాంటీ నక్సలైట్‌  స్క్వాడ్‌ అలవెన్స్‌ను బేసిక్‌ పేలో 15 శాతం ఇంక్లూడ్‌ చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.



# కేంద్ర ప్రభుత్వసర్వీసు ఉద్యోగులతో సమానంగా జ్యుడీషియల్‌ అధికార్లకు డీఏ, జ్యుడీషియల్‌ పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తూ విడుదల చేసిన జీవోలను ఆమోదించిన కేబినెట్‌. 

01–01–2023 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు. 



# 50 ఎకరాలలోపు భూములకు సంబంధించిన ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన  110 అలాట్‌మెంట్‌లను ఆమోదించిన కేబినెట్‌. 

10–11–2023 నుంచి 06–12–2023 మధ్య జరిగిన కేటాయింపులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.



# ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డులో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ఇకపై ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణాం ఏపీ మారిటైం బోర్డుపరిధిలోకే. 


# ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గానూ కొత్తగా ఏర్పాటు అయిన కమలాపురం నగరపంచాయితీలో 7 పోస్టుల భర్తీతో పాటు, కమలాపురం, మీరాపురం గ్రామపంచాయితీలను విలీనంచేసి కమలాపురం నగరపంచాయితీగా ఏర్పాటు చేసిన నేపధ్యంలో... ఇప్పటికే ఉనికిలో ఉన్న 14 పోస్టులను తగిన కేడర్‌లో సర్ధుబాటు చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.



# విశాఖపట్నంలో 4 కారిడార్లలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం.

76.9 కిలోమీటర్ల నిడివితో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌.



# పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా జడ్జి మరియు సెషన్స్‌ జడ్జి కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.


# న్యాయశాఖలో 2 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.



# తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో ఆర్‌ అండ్‌ బి యూనిట్‌ కార్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.


# ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం.

ఐదు ఆటల్లో 51రోజులపాటు ఆడుదాం ఆంధ్ర.

క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబాడీ, ఖోఖో ఆటల్లో పోటీలు.

ఇప్పటివరకూ 1.14 కోట్ల రిజిస్ట్రేషన్లు.

31 లక్షల మంది క్రీడాకారులు ఇప్పటివరకూ నమోదు చేసుకున్నారు.

మండల స్థాయిలో బహుమతిగా క్రీడాపరికరాలు.

నియోజకవర్గ స్థాయిలో రూ.35వేలు, రూ.15వేలు, రూ.5వేలు బహుమతులు.

జిల్లా స్థాయిలో రూ.60వేలు, రూ.30వేలు, రూ.10వేలు.

రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు.

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పోటీలకు ... నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు.

జిల్లాస్థాయిలో రూ. 35వేలు, రూ.20వేలు, రూ.10వేలు

రాష్ట్ర స్థాయిలో రూ.2 లక్షలు, రూ.1లక్ష, రూ.50వేలు.


ఆడుదాం ఆంధ్ర పోటీలకు దాదాపుగా రూ.120 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.

డిసెంబర్‌ 26న ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం.

ఆడుదాం ఆంధ్ర బ్రాండ్‌ అంబాసిడర్లుగా అంబటి రాయుడు, కరణం మల్లేశ్వరి, కోన శ్రీకర్‌ భరత్, రావి కల్పన, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, వి.జ్యోతి సురేఖ, సాత్విక్, సాకేత్‌ మైనేని, చేతన్‌ ఆనంద్, కోనేరు హంపి, ఇ.రజని.

ఆడుదాం ఆంధ్రకు కర్టెన్‌ రైజర్‌గా ఎమ్మెల్యేలకు పోటీలు. 



# సాధారణ ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన అదనపు సిబ్బందిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్‌ మరియు రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాలాయాల్లో వివిధ కేటగిరీలలో నియామకానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

982 మందిని తాత్కాలిక పద్దతిలో నియామకానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.



# తుపాను కారణంగా జరిగన నష్టంపై కేబినెట్‌లో చర్చ.

తుపాను సమయంలో తీసుకున్న చర్యలపైనా కేబినెట్‌లో చర్చ.

తీసుకున్న చర్యలను మంత్రివర్గ సభ్యులకు వివరించిన అధికారులు.

తుపాను సమయంలో 492 శిబిరాలు ఏర్పాటు చేశాం.

33,010 మందిని శిబిరాల్లో చేర్చాం.

1,32,613 మందికి ఆహార ప్యాకెట్లు అందించారు.

374 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు.

ప్రభుత్వం తక్షణ సహాయం కోసం రూ.52.47 కోట్లు విడుదల

శిబిరాలకు వచ్చిన వారికే కాకుండా నీళ్లు నిలిచిన వారందరికీ కూడా ప్రత్యేక సహాయం.

1,10,110 మందికి ప్రత్యేక సహాయం.

వ్యక్తి అయితే రూ.1000లు, కుటుంబానికి రూ.2500 చొప్పున సహాయం.

ఈ తరహా సహాయం గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు.

ప్రత్యేక ఆర్థిక సహాయం కింద రూ.28.07 కోట్లు పంపిణీ.

మిచాంగ్‌ తుపానులో చేపట్టిన సహాయక చర్యల వివరాలను కేబినెట్‌కు అందజేసిన అధికారులు.



# కుల, ఆదాయ ధృవీకరణపత్రాలు మంజూరులో తీసుకొచ్చిన సంస్కరణలకు ఆమోదముద్రవేసిన మంత్రిమండలి.


సర్టిఫికెట్ల జారీలో మరొక సంస్కరణదిశగా అడుగులు.

కుల ధృవీకరణ పత్రాల విషయంలో కీలక అడుగు.

గతంలో కులధృవీకరణపత్రం ఇచ్చినా, తండ్రికి గాని, అన్నదమ్ములకుగాని గతంలో జారీచేసిన ధృవీకరణ పత్రం ఇచ్చినా దాని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వెంటనే కులధృవీకరణ పత్రాలు జారీచేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం

సర్టిఫికెట్లు పొందడంలో ఇప్పుడున్న జాప్యాన్నికూడా తగ్గించేలా ప్రయత్నం.

అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే జారీచేయడానికి ఈ సంస్కరణలు ఉపయోగం.


ఆదాయపు ధృవీకరణ పత్రంలో కూడా సంస్కరణ

ఆదాయధృవీకరణ పత్రాన్ని అందించే బాధ్యత దరఖాస్తుదారుడిది కాదు, అధికారులదే.

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు ఆదాయపు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తుదారుల జాబితా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు.

ఆ జాబితాపై సిక్స్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌లో భాగంగా నిర్ధారణ.

సిక్స్‌ స్టెఫ్‌ వెరిఫికేషన్లో విఫలం అయితే రెవిన్యూ సిబ్బందికి పంపుతారు

వారు వెంటనే పరిశీలనచేసిన ఆటోమేటిగ్‌గా నిర్ధారించి పంపుతారు.

గడచిన రెండేళ్లలో 75 లక్షల ఆదాయపు ధృవీకరణ పత్రాలు జారీచేశాం.

జగనన్న సురక్షలో 39 లక్షల ఆదాయపు ధృవీకరణ పత్రాలు జారీచేశాం.

ఈ నేపథ్యంలో సంస్కరణకు శ్రీకారం చుట్టిన అధికారులు. 



# ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం రాయనపాడులో 0.20సెంట్ల ప్రభుత్వ భూమిని సీఐడీ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన మంత్రిమండలి. 


# అన్నమయ్య జిల్లా చిట్వేలు, కోడూరు, సంబేపల్లె మండలాల్లో జిల్లా హరిజన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భూములను.. భూమిలేని ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

1269 ఎకరాలను, 796 మంది లబ్దిదారులకు డీకేటీ పట్టాలు పంపిణీ.



# స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లకు శాశ్వత భవనాలు.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో 7 ఎకరాల భూమిని నేషనల్‌ స్కిల్‌ ఇనిస్టిట్యూట్‌ తో పాటు, రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌  అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ భవనాల కోసం కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. 



# ప్రముఖ జానపద కళాకారుడు స్వర్గీయ వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో 1000 చదరపు గజాల ఇంటిస్ధలాన్ని గజం రూ.10లకే ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. 



# విశాఖపట్నం జిల్లా మధురవాడ వద్ద 11.25 ఎకరాల భూమి బెంగుళూరుకు చెందిన టీఐఎస్‌బీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు కేటాయింపు.

ఎకరా కోటి రూపాయల చొప్పున కేటాయింపు.

ఈ స్కూల్లో 25 శాతం సీట్లు విద్యా హక్కు చట్టం కింద, మరో 25శాతం సీట్లు స్థానికులకు ఉచితంగా కేటాయింపు.



# బీచ్‌ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వద్ద 5 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం.

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం నాగూరులో మూడు సర్వే నెంబర్లలో సుమారు 10 ఎకరాల భూమిని సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ అండ్‌ ఫిట్నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రహదారులు, భవనాలశాఖకు ఉచితంగా కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.


# కర్నూలు జిల్లా ఆదోని మండలం ఎస్‌.కొండాపురం, బైచిగిరి, కాపటి గ్రామాలకుచెందిన సుమారు 10 ఎకరాల భూమిని ఆర్టీఓ కార్యాలయం, డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు కోసం రహదారులు, భవనాలశాఖకు కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.


కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం, దూపాడు గ్రామాలకు చెందిన 5.68 ఎకరాల భూమిని పర్యాటరంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖకు కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.



# రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం. 

మృతిచెందిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.

రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

Comments