ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..

 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..హైదరాబాద్ (ప్రజా అమరావతి):  తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్ వేదిక వద్దకు చేరుకున్నారు.

కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.


*సీఎం రేవంత్ జట్టు ఇదే..*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తెలంగాణలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురిచే గవర్నర్ తమిళసై మంత్రులుగా ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ....

Comments