పేదల జీవితం మారడానికి విద్యే మూలం: ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి.



*డా.బి.ఆర్. అంబేద్కర్ వర్దంతి సంధర్భంగా కలెక్టరేట్లో ఘనంగా నివాళులు*


*సమాజంలో కుల అసమానతలు నిర్మూలించాలంటే వజ్రాయుధం విద్యే అని నమ్మిన మహానుభావుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్*


*పేదల జీవితం మారడానికి విద్యే మూలం: ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి


*


*డా.బి.ఆర్. అంబేద్కర్ జీవితం ఆదర్శనీయం... చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్* 


తిరుపతి, డిసెంబర్ 06 (ప్రజా అమరావతి): పేదల జీవితం మారడానికి విద్య ఎంతో అవసరమని, విద్యే మూలం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు  కె.నారాయణ స్వామి అన్నారు.


బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్దంతి సంధర్భంగా  ఎస్.సి. సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు అర్పించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. 


అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవుడి దృష్టిలో అందరూ సమానం అని, కులం లెక్కకు కాదని అన్నారు. దళితులు అంటేనే ఆ కాలంలో అంటరానివారని దూరం పెట్టే వారిని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. సాహెబ్ అంబేద్కర్ సమాజంలో కుల అసమానతలు నిర్మూలించాలంటే వజ్రాయుధం విద్యే అని నమ్మి పేద వారికి కూడా విద్య అందాలని,  కుల నిర్మూలన కుల వ్యవస్థపై  ప్రజాస్వామ్యంలో దళితులకు స్వేచ్ఛ అంశాలపై అధ్యయనం చేశారని అన్నారు.   పేదల జీవితాలు మారాలంటే వారికి  విద్యే మార్గం అని నమ్మి మార్పులను తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు అండగా పథకాలను అమలు చేస్తున్నారని, పేదల జీవితాలను మార్చి వారిని ఆర్థికంగా మెరుగుపడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.  


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జీవితం ఆదర్శనీయమని అన్నారు. బలహీన వర్గంలో జన్మించినా  తన స్వయంకృషితో  ఉన్నత స్థానానికి అంబేద్కర్ ఎదిగారని, ఆయన రాసిన పుస్తకాలు, ఆధునిక సమాజానికి అంబేద్కర్ చేసిన సేవ అనన్యమైనవని అన్నారు. తన  జీవితంలో ఎన్నో అవార్డులను పొందారని, ఎన్నో పుస్తకాలు చదివారు అని, సంఘ సంస్కర్తగా కుల మతాలకు అతీతంగా వెనుకబడిన తరగతుల, స్త్రీల సంక్షేమానికి , కులవివక్షతను పారద్రోలెందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. అందుకే ఆయనను చిరస్మరణీయుడుగా మనం స్మరించుకుంటామని అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, ఎస్ డి సి శ్రీనివాస రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి తదితర  జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments