మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

  తెనాలి (ప్రజా అమరావతి );    గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను




జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మరియు ఆర్డిఓ గీతాంజలి శర్మ మరియు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు  అన్నా భత్తిని శివకుమార్ నియోజకవర్గంలోని పెదరావూరు, బుర్రిపాలెం,జెముడుబాడు, దావులూరు, తూములూరు మరియు కొల్లిపర గ్రామాలలో తుఫాను ప్రభావం కారణంగా నేలవాలిన వరిపోలాలను వ్యవసాయాధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఎంతమేర పంటనష్టం జరిగిందనీ, పెట్టుబడి యెంత ఖర్చు అయిందన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి  మాట్లడుతూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి మరియు తాడికొండ ప్రాంతాలలో తుఫాను కారణంగా  ఎక్కువగా పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రెండు వారాలలో పంట కోతకు వచ్చేటువంటి వరి, మినుము పంటలు పాడైపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగించే విషయమని తెలిపారు రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వము అండగా ఉంటుందని తెలిపారు . ఈ నెల 10వ తారీఖు నుండీ వ్యవసాయాధికారులు , మండల అధికారులు, సచివాలయసిబ్బంది కలిసి అన్ని పొలాలను సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆర్బికే కేంద్రాలలో ఆ నివేదికను ఉంచడం జరుగుతుందని తెలిపారు. నిజంగా నష్టపోయింది కౌలు రైతులు కాబట్టీ రైతులు అందరూ పెద్దమనసుతో కౌలు రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అలాగే శ్రీ ముఖ్యమంత్రి వైయస్స్ జగన్ మోహన్ రెడ్డి  సూచనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ప్రభుత్వము సిద్దముగా ఉందని తెలిపారు.కార్యక్రమంలో అధికార ప్రతినిదులు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు రైతులూ పాల్గోన్నారు

Comments