సంక్షేమం అందిస్తున్న జగన్నే గెలిపించుకొందాం.

    తెనాలి (ప్రజా అమరావతి);

సంక్షేమం అందిస్తున్న జగన్నే గెలిపించుకొందాం


 ప్రతి వార్డులో కోట్లసంక్షేమం అందిస్తున్నజగన్  ప్రభుత్వమే మళ్ళీ  రాష్ట్రంలో మళ్ళీ  గెలిపించు కుందామని తెనాలి  ఛైర్మన్ తాడిబోయిన రాథిక అన్నారు. గురువారం గంగానమ్మపేటలోని Dr. హనమంతరావు (ఎముకల) ఆస్పత్రి వీథిలో  35 వ వార్డు  సచివాలయంలో జరిగిన "జగనే ఎందుకు కావాలి" వార్డు సమావేశంలో  ఆమె  మాట్లాడుతూ 35 వ వార్డులో ఆర్థిక పరమైన  ఆర్థికేతరమైన 38రకాల పథకాలకు 14.86కోట్లు సంక్షేమం అందివ్వటం జరిగిందని గతంలోని ప్రభుత్వం  శుష్క వాగ్దానాలు చెసింది తప్ప ఆచరణ లేదన్నారు.


తెనాలి  క్లష్టర్ 2 నాయకులు దుబాయి బాబు మాట్లాడుతూ ఈవార్డు ప్రజలకు అర్హులైన సంక్షేమం అభివృథ్థి అందించి వార్డులోని నిరుపేదలకు ఆదుకొన్నారని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారుంటే వారందరికీ సంక్షేమ పథకాలను అందించుటకు సిథ్థంగా ఉన్నామన్నారు.  


కౌన్సిలర్ గొడవర్తి హరేరామ్ మాట్లాడుతూ వరిసాగులో పంజాబ్ సగటున 41 బస్తా తర్వాత  మనరాష్ట్రం సగటున 37 బస్తాల దిగుబడితో ద్వీతీయ స్దానంలో ఉన్నామని, CM గా  జగన్మోహనరెడ్డిని ,స్దానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ను తిరిగి MLAగా ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతేని ఉందన్నారు.ఈ కార్యక్రమంలో  తెనాలి మున్సిపల్  మేనేజర్ అప్పలరాజు,  వైకాపా నాయకులు   ఇడుపల వాసు,  గుండం శ్రీను, వేంకట్రావు ,సచివాలయ సిబ్బంది, వార్ఢు వాలంటీర్లు, గృహసారథులు ,ప్రభృతులు పాల్గొన్నారు.

Comments