ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి.




*ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై ముమ్మరంగా ప్రచారం:*

*డిసెంబర్‌18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు:* 

*ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి:*


*జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి:*

*దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు:* 

*ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు, ఖాళీలు ఉండకూడదు:*

*వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో మరోసారి స్పష్టంచేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


అమరావతి (ప్రజా అమరావతి);

*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

ఆరోగ్యశ్రీ మీద విసృతంగా, ముమ్మరంగా ప్రచారం చేయాలి:

ఆరోగ్య శ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి:

ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదు:

ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యాన్ని అందుకునేవారికి ఈ విషయాలన్నీ తెలియాలి:

సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలి:

ఏ పేదవాడుకూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు:

వైద్యం ఖర్చులకోసం ప్రజలు అప్పులు పాలుకాకూడదు :

ఉచితంగా ఎలా వైద్యం పొందాలన్నది ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియాలి:

ప్రజారోగ్య రంగంలో ఆరోగ్య శ్రీ అన్నది విప్లవాత్మక మార్పు:

ఎమ్మెల్యేలుకూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి:


*1,42,34,464 కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు వేగంగా ప్రింట్‌ అవుతున్నాయని వెల్లడించిన అధికారులు.*

పెద్ద మొత్తంలో ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నందున ప్రింటింగ్‌ కొనసాగుతోందని వెల్లడించిన అధికారులు

ఇదివరకే ఆరోగ్య శ్రీకి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్లు సిద్ధంచేశామన్న అధికారులు.

డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడి.

సీఎం ఆదేశాల మేరకు పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని వెల్లడి.


*జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.*

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం.

ఆరోగ్య సురక్షలో కార్యక్రమంలో మూడు ప్రధాన అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం.

జగనన్న ఆరోగ్య సురక్షలో రోగులకు మందులు అందించడం అనంతరం ఫాలో అప్‌ చేయాలి.

రెండో అంశం గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్నవారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్‌ చేయడం.

మూడోది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అందిస్తున్న మెడిసిన్‌ పూర్తవగానే వారికి అవసరమైన మందులు మరలా అందేలా చూడాలి.

ఈ మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్న సీఎం. 


చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద రూ.500లు ఇవ్వాలి: సీఎం

కంటిచికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారు.

ఇందులో 73,602 మందిని ఇప్పటికే చికిత్సకు పంపించామని వెల్లడించిన అధికారులు.

వీరందరికీ పరీక్షలు చేసిన తర్వాత వీరిలో చాలామందికి వైద్యులు మందులు ఇచ్చారని తెలిపిన అధికారులు

వైద్య పరీక్షల ఫలితాలు తర్వాత 16,128 మందిని అడ్మిట్‌ చేశారన్న అధికారులు.

ఇందులో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్‌మెంట్లు  పూర్తయ్యాయని వెల్లడి.

ఇన్‌పేషెంట్లుగా చేరిన వారిపై మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం. 

డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి అందిస్తున్న వైద్యంపై మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.


78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామన్న అధికారులు.

13,614 మందికి ఇప్పటికే కాటకాక్ట్‌ చికిత్సలు చేయించామన్న అధికారులు.

కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మరో 7,272 మందికి చికిత్సలు అందించామన్న అధికారులు.

మిగిలిన వారికి కూడా నాణ్యమైన చికిత్సలు అందించేలా చూడాలన్న సీఎం.

5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్న అధికారులు.


షుగర్, రక్తపోటుతో బాధపడుతున్న వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వెల్లడి.

టీబీ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నామన్న అధికారులు.


జగనన్న సురక్ష శిబిరాల్లో గుర్తించిన రోగులకు సకాలానికే మందులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్న అధికారులు.

ఇచ్చిన మందులు అయ్యేలోగా మళ్లీ మందులు పంపించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.

దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్‌ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుందన్న సీఎం.

ఫ్యామిలీ డాక్టర్‌ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అన్న దానిపై పరిశీలన చేయాలన్న సీఎం.

ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలన్న సీఎం.


ఆరోగ్య శ్రీ యాప్‌ను అందరికీ అందుబాటులో ఉంచేలా చూస్తున్నామని వెల్లడి.

ప్రతి కుటుంబంలో కూడా యూప్‌ డౌన్లోడ్‌ అయ్యేలా చూస్తున్నామని వెల్లడి.

ఇదే సమయంలో దిశ యాప్‌ కూడా డౌన్లోడ్‌ చేసుకునేలా కార్యక్రమం చేపట్టాలన్న సీఎం.


*జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండోదశ కార్యక్రమాలు.*

రూరల్‌ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతివారం ఆరోగ్య సురక్ష క్యాంపు.

క్యాంపుల వద్దే అవసరమైన వైద్య పరీక్షలు.

క్యాంపుల్లో పాల్గోనున్న స్పెషలిస్టు వైద్యులు.


2023–24లో నవంబర్‌ నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించిన అధికారులు.

గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం అధికంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు తీసుకున్నారని వెల్లడించిన అధికారులు.


చైనాలో విస్తరిస్తున్న  హెచ్‌ 9 ఎన్‌ 2 వైరస్‌ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశం.

ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం.

అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్న అధికారులు.

బోధనాసుపత్రులు, పీడియాట్రిక్‌ హెచ్‌ఓడీ విభాగాలు, పల్మనాలజీ, జనరల్‌ మెడిసన్‌ విభాగాల్లో తగిన సదుపాయాలు కల్పనపై దృష్టిపెట్టామన్న అధికారులు.

ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా చూడాలని, ఇది లక్ష్యంగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం.

Comments