సచివాలయంలో తొలి స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సమావేశం.

- సచివాలయంలో తొలి స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సమావేశం


- వన్యప్రాణి సంరక్షణ చర్యలపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షఅమరావతి (ప్రజా అమరావతి):


వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అభయారణ్యాల్లో వన్యప్రాణి సంరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అభయారణ్య ప్రాంతాల్లో అభివృధ్ధి కార్యక్రమాల వల్ల వన్యప్రాణుల మనుగడకు ఎటువంటి ముప్పు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు. దీనిపై నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులపై ప్రభావంను అధ్యయనం చేయాలని అన్నారు. 

  ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిసిఎఫ్ వై.మధుసూధన్ రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ విభాగం ఎపిసిసిఎఫ్ శాంతిప్రియ పాండే, స్టాండింగ్ కమిటీ సభ్యులు అడిషనల్ డిజిపి రవీంద్రబాబు, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దీపా, ఫిషరీస్ డైరెక్టర్ జి.హేమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments