ఉద్యోగుల గ్రీవెన్స్ డే లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్.

 విజయవాడ (ప్రజా అమరావతి);


ఉద్యోగుల గ్రీవెన్స్ డే లో పాల్గొన్న  రాష్ట్ర  

రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్


 రాష్ట్ర  రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ ఈ రోజు ఆర్టీసీ హౌస్ సందర్శించారు. సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.తో భేటీ అయ్యి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఉద్యోగుల గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ హౌస్ లో ఉద్యోగులకు నిర్వహించిన గ్రీవెన్స్ డే లో సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. తో పాటు  రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ కూడా పాల్గొన్నారు. 

వివిధ జిల్లాల నుండి వచ్చిన 15 మంది అభ్యర్ధనలు స్వయంగా విని తగిన చర్యలు తీసుకోవాలని ఎం.డి.గారికి సూచించారు. పరిష్కారమయ్యే ఆర్జీలను సాధ్యమైనంతవరకు త్వరగా చూడాలని తెలిపారు. 

  ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా శ్రీ విశ్వరూప్ తెలిపారు. 

ఈ గ్రీవెన్స్ డే లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి(అడ్మిన్) కూడా పాల్గొన్నారు.       

Comments