జగనన్న అడగకుండానే ఇచ్చే దేవుడు అందుకే రాష్ట్రప్రజలకు జగన్ కావాలి.

   తెనాలి (ప్రజా అమరావతి);

జగనన్న అడగకుండానే  ఇచ్చే దేవుడు అందుకే రాష్ట్రప్రజలకు జగన్ కావాలితెనాలి 8వ వార్డు ఛైర్మన్ స్వంత వార్డు సచివాలయం లో శుక్రవారం  జరిగిన  ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో  తెనాలి ఛైర్మన్ తాడిబోయిన రాథికరమేష్  మాట్లాడుతూ కుల మత  రాజకీయాలు చేయకుండా అర్హత కలిగిన ప్రతీ వారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు, ఒక్క 8వ వార్డుసచివాలయంలో 17.75 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమం కొరకు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు,


 వైకాపా తెనాలి టౌన్ అద్యక్షులు మద్దాలి శేషాచలం మాట్లాడుతూ జగనన్న ఇస్తున్న 38 రకాలసంక్షేమ పధకాల ను విశదీకరించి ఇవి  అమలులో ఆంధ్ర ప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని, మళ్ళీ  జగన్  స్థానికంగా MLA అన్నాబత్తుని శివకుమార్  వస్తే, రాష్ట్రం బాగుంటుందని,  సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల యొక్క మొఖంలో ఆనందాన్ని చూసి తనకూ ఆనందం కల్గుతుదన్నారు. ఓట్లు కోసం వచ్చే నాయకులు తప్ప ఓట్లు తర్వాత వచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైయస్సార్ పార్టీ నాయకులని  తాము నిరంతరం ప్రజలమథ్యే ఉంటామన్నారు,


ఈ కార్యక్రమంలో మేనేజరు అప్పలనాయుడు , 5 వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, వైకిపా నాయకులు రమేష్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.Comments