రాజీ లేకుండా రైత‌న్న‌కు ప‌రిహారం.

 *రాజీ లేకుండా రైత‌న్న‌కు ప‌రిహారం


*

*పంట‌లు న‌ష్ట‌పోయిన సంద‌ర్భాల్లో వెనువెంట‌నే ప‌రిహారం అందిస్తున్న ఏకైక ప్ర‌భుత్వం మాది*

*అన్న‌దాత‌లే జ‌గ‌న‌న్న ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌*

*బాధిత రైతులెవ‌రూ ఆందోళ‌న చెంద‌వద్దు*

*జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో  అండ‌గా  ఉంటుంది*

*చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో 6470 హెక్టార్ల‌లో పంట న‌ష్టం*

*ప్రాథ‌మిక నివేదిక ప్ర‌భుత్వానికి అంద‌జేత‌*

*వారం రోజుల్లో మంచి శ‌న‌గ విత్త‌నాల ఉచిత పంపిణీ*

*మిర్చి పంట‌కు తీవ్ర న‌ష్టం*

*బాధిత రైతులంద‌రికీ ప‌రిహారం అందుతుంది*

*ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి నివేదిక ప్ర‌భుత్వానికి అంద‌జేత‌*

*ఆ వెంట‌నే ప‌రిహారం పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభం*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు*

*మిచౌంగ్ తుపాను వ‌ల్ల న‌ష్ట‌పోయిన పంట పొలాల సంద‌ర్శ‌న‌*

చిలకలూరిపేట (ప్రజా అమరావతి);

అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉండ‌టంలో ఈ దేశంలోనే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ఆద‌ర్శంగా ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల  ర‌జిని తెలిపారు. మిచౌంగ్ తుపాను ధాటికి దెబ్బ‌తిన్న పంట పొలాల‌ను శుక్ర‌వారం రాష్ట్ర‌ వైద్య  ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ప‌రిశీలించారు. నాదెండ్ల మండ‌లం తూబాడు,గున్నవారిపాలెం, రాజుగారిపాలెం, బుక్కాపురం తదిత‌ర గ్రామాల ప‌రిధిలో పంట పొలాల‌ను మంత్రి గారు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల పంట న‌ష్ట‌పోయిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ వెనువెంట‌నే న‌ష్ట‌పరిహారం అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు రైతు ప‌క్ష‌పాతి అనితెలిపారు. గ‌త విపత్తుల సమ‌యంలోనూ జ‌గ‌న‌న్న రాజీ లేకుండా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేశార‌ని గుర్తుచేశారు. రైతుల అంచ‌నాకు మించి ప‌రిహారం అందించ‌డంలో త‌మ ప్ర‌భుత్వం ముందుంద‌న్నారు. మిచౌంగ్ తుపాను వ‌ల్ల ప‌ల్నాడు జిల్లా వ్యాప్తంగా పంట‌లు దెబ్బ‌తిన్నాయ‌ని పేర్కొన్నారు. ఒక్క చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోనే మొత్తం  6470 హెక్టార్ల‌లో పంట దెబ్బ‌తిన్న‌ద‌ని వెల్ల‌డించారు. మంచి శ‌న‌గ, మిర్చి పంట‌లు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. 1240 హెక్టార్ల‌లో మిర‌ప‌, 4వేల హెక్టార్ల‌లో మంచి శ‌న‌గ దెబ్బ‌తిన్న‌ట్లు అధికారులు ప్రాథ‌మిక నివేదిక అందించార‌ని వెల్ల‌డించారు. ఇంకా పూర్తి స్థాయిలో వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ని వెల్ల‌డించారు.

*స‌త్వ‌ర‌మే మంచి శ‌న‌గ విత్త‌నాలు ఉచితంగా పంపిణీ*

నియోజ‌క‌వ‌ర్గంలో మంచి శ‌న‌గ పంట మొల‌క ద‌శ‌లో ఉండ‌గానే భారీ వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. పంట మొత్తం దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పారు. బాధిత రైతులంద‌రికీ వారం రోజుల్లో మ‌ళ్లీ  ఉచితంగా శ‌నగ విత్త‌నాలు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంద‌ని చెప్పారు. మిర్చి, ప‌త్తి.. ఇత‌ర పంట‌లకు వాటిల్లిన న‌ష్టాన్ని కూడా అధికారులు అంచనావేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీలోగా నివేదిక‌లు అందించాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అధికారులకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. ఈ మేర‌కు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ని తెలిపారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని, న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతుకూ ప‌రిహారం వ‌చ్చేలా అధికారులు చొర‌వ‌చూపాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నివేదిక‌లు ప్ర‌భుత్వానికి చేరిన వెంట‌నే ప‌రిహారం పంపిణీ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌న్నారు. 

*అధికారులు, శాస్త్ర‌వేత్త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో*

తుపాను వ‌ల్ల దెబ్బ‌తిన్న రైతుల‌కు నిరంత‌రం వ్య‌వ‌సాయ‌శాఖ, ఉద్యాన‌శాఖ‌, లాం త‌దిత‌ర విభాగాల అధికారులు అందుబాటులో ఉండాల‌ని తాను ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశాన‌ని పేర్కొన్నారు. ఆ మేర‌కు తుపాను ప్రారంభ‌మైన నాటి నుంచి అధికారులు రైతుల‌కు నిరంత‌రం అందుబాటులో ఉన్నార‌ని చెప్పారు. మిర్చి త‌దిత‌ర పంట‌లు ఉర‌కెత్త‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను లాం శాస్త్ర‌వేత్త‌లు రైతుల‌కు వివ‌రిస్తున్నార‌ని తెలిపారు. శ‌న‌గ మ‌ళ్లీ విత్తుకునేలా అధికారులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌ని పేర్కొన్నారు. రైతుల‌కు ఎలాంటి  న‌ష్టం వాటిల్ల‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అధికారులు పూర్తిస్థాయిలో రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని, న‌ష్టం తీవ్ర‌త త‌గ్గేలా స‌ల‌హాలు , సూచ‌న‌లు ఇవ్వాల‌ని, న‌ష్ట‌ప‌రిహారం న‌మోదులో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు ఉండ‌టానికి వీల్లేద‌ని మంత్రి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్య‌క్ర‌మంలో ఏడీఏ మ‌స్తాన‌మ్మ‌, ప‌ల్నాడు జిల్లా  వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కుడు ర‌మేష్, ఉద్యాన‌వ‌న‌శాఖ అధికారి కిషోర్‌, నాదెండ్ల మండ‌లం వ్య‌వ‌సాయాధికారి హ‌రిప్ర‌సాద్‌,మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్రప్రసాద్,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ తలతోటి రాణి,మండల అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి,సొసైటీ చైర్మన్ కురుకుంట్ల వెంకటరెడ్డి,సర్పంచ్ గోళ్లమూడి కాసియ్య,పెరుమలపల్లి వెంకటేశ్వర్లు,నాయకులు బత్తుల సీతారామిరెడ్డి,గుర్రం ఉపేంద్ర,దాట్ల విక్రమ్ రాజు,సొలస భాస్కర రెడ్డి,మాదం శ్రీనివాసరావు,గోపు అంథోన్ రెడ్డి,ఏరువ వివేక్ రెడ్డి,తలతోటి రత్తయ్య,ఏరువ సుందరరెడ్డి,ఉయ్యురు చిన్నపరెడ్డి మరియు పలువురు.


Comments