జగన్ రెడ్డి పాలనలో ధరాఘాతం.*జగన్ రెడ్డి పాలనలో ధరాఘాతం


*


*5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టారు?*


*బూతులు తిట్టిన వారికే వైసీపీలో సీట్లు...ఇదొక రోత రాజకీయం* 


*ఎన్నికల ముందు జగన్ ముద్దులు..అధికారంలోకి వచ్చి గుద్దులు*


*గంజాయి, అప్పులు, నిరుద్యోగంలో రాష్ట్రాన్ని జగన్ నెం.1 చేశాడు*


*బొబ్బిలి రా..కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు* 


బొబ్బిలి (ప్రజా అమరావతి):- జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్ధితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘‘నేడు జనసునామీతో  బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తోంది. ఈ గర్జనకు తాడేపల్లి ప్యాలెస్ పిల్లి వణికిపోతోంది. గతంలో బొబ్బిలి రాజులు ప్రజల కోసం పనిచేశారు..నేడు సైకో స్వార్ధంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసమే రా...కదలిరా అని పిలుపునిచ్చా. రోడ్లు కూడా సరిగా లేని సమయంలో ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్దిచేశాం. టెలికమ్యూనికేషన్ కు నాంది పలికాం. ఐటీ అభివృద్ధికి బాటలు వేశా. యువతకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తిగా ఎదుగుతారు.  హైదారాబాద్  లో అడుగడుగునా నా అభివృద్ది కనిపిస్తుంది. నేను ఐటీ అభివృద్ది చేయటం వల్లే  అనేక దేశాల్లో తెలుగు జాతి స్ధిరపడింది.  నాకు కష్టం వచ్చినపుడు 80 దేశాల్లో తెలుగు వారు మద్ధతు తెలిపారంటే  అది మన సత్తా. 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాతియుగం వైపుగా నడిపిస్తున్నారు. మీకు రాతి యుగం కావాలో.. స్వర్ణయుగం వైపు నడుస్తారో నిర్ణయించుకోండి. వైసీపీ పాలనలో అడుగడుగునా అన్యాయాలు, దౌర్జన్యాలే. నూతన సంవత్సరంలో స్వర్ణయుగం కోసం సంకల్పం చేశా.  తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ. పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు పండుగ చేసుకునే పరిస్థితి లేదు. టీడీపీ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు 8 రకాల సరుకులు ఇచ్చాం. అన్న క్యాంటీన్ ద్వారా రూ.5కే పేదలకు మూడు పూటలా అన్నం పెట్టాం. జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తాం. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. 1983లోనే రూ.2లకే కిలో బియ్యం, సగం ధరకే చీర, దోవతి, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. నేను చంద్రన్న భీమా, విదేశీ విద్య, పెళ్లికానుక వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తే జగన్ రెడ్డిగ వాటినీ  రద్దు చేశారు. 

*పన్నుల పోటు..ధరల పెంపుతో నడ్డి విరుస్తున్న జగన్* 

వైసీపీ అధికారంలోకి వచ్చాక పన్నుల పోటుతో.. ధరల పెంపుతో ఈ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెంచారు. టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. జగన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు..కానీ సక్రమంగా కరెంట్ ఇవ్వటం లేదు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చాం..నేడు అది కూడా ఇవ్వటం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు తగ్గిస్తాం. సోలార్ విద్యుత్ ని ప్రోత్సహిస్తాం. విజయనగరం జిల్లాకు 50 వేల సోలార్ పంపు సెట్లు ఇచ్చాం. మద్యం రేట్లు పెంచి నాసికరం మద్యంతో ఆడబిడ్డల మాంగళ్యాలతో ఆడుకుంటున్నారు.  రూ.50 ఉన్న క్వార్టర్ బాటిల్ రూ.200 పెంచారు. రూ.150లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి.?  ఎన్నికల  ముందు జగన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానన్నడా లేదా? మద్యపాన నిషేదం చేస్తేనే ఓట్లడుగుతానని చెప్పాడా లేదా? మరి చేశాడా? మద్య నిషేదం చేయకపోగా 25 ఏళ్లకు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. చెత్తపై పన్ను వేసిన చెత్త మఖ్యమంత్రి జగన్ రెడ్డి. 

*అప్పుల అప్పారావు...జగన్*

పెట్రోల్, డీజీల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నెం1.  రైతుల అప్పుల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నెం.1. జగన్ ఒక అప్పుల అప్పారావు రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశారు. అవి జగన్ మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి పారిపోతాడే తెలీదు. అప్పులు మనమే కట్టాలి. గంజాయి, డ్రగ్స్ రవాణాలో కూడా ఏపీనే టాప్. గంజాయి, డ్రగ్స్ కి అలవాటు అయితే మన పిల్లల భవిష్యత్తు ప్రమాదంగా మారుతుంది. జగన్ రెడ్డి గంజాయిపై ఒక్క సారైనా సమీక్ష చేశారా? నేను ఉచితంగా ఇసుక ఇస్తే విమర్శలు చేశారు. నేడు ఇసుక దొరుకుతుందా.? మీ పొలాల్లో మట్టిని కూడా వైసీపీ నేతలు తినేస్తున్నారు. కోర్టు దిక్కరణ కేసుల్లో కూడా ఏపీనే నెం. 1.  

*ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు*

ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు..డీఎస్సీ అన్నాడు ఇచ్చాడా?  ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? కమీషన్ల కోసం పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. జాబు రావాలంటే బాబు రావాలి. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత టీడీపీ – జనసేన తీసుకుంటుంది. యువగళం నిధి కింద నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం.  వర్క్ ప్రం హోం విధానం తీసుకొస్తాం. నియోజకవర్గాల్లో వర్క్ స్టేషన్లు కడతాం.  

*డ్రాయర్ కూడా లేని నిరుపేద జగన్*

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ జగన్ ఆదాయం మాత్రం టాప్. దేశంలోకెల్లా రిచెస్ట్ సీఎం జగన్. కానీ 5 ఏళ్లలో పేదల ఆదాయం పెరిగిందా? వారి జీవన ప్రమాణాలు పెరిగాయా? 5 ఏళ్లలో దోచుకోవాల్సిదంతా దోచుకుని నిరుపేదనని, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారు. నేను పెత్తందారుడుని అంట..జగన్ నిరుపేద అంట. ఆయనకు సాక్షి పేపర్, సాక్షి టీవీ లేదంట.. ప్యాలెస్ లు, ప్యాక్టరీలు కూడా లేవుం అంట. కనీసం డ్రాయర్ కూడా లేని నిరుపేద జగన్. ముద్దులకు మురిసిపోయి ఓట్లు మీరు గుద్దారు. రూ.200 ఉన్న ఫించన్ రూ.2 వేలకు పెంచిన ఘనత టీడీపీదే. కానీ ఫించన్ రూ.1000 నుంచి రూ. 3 వేలకు పెంచానని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. రూ.3 వేలు పెంచుతానని ఫించన్ పై మాట తప్పి ప్రతి ఫించన్ దారుడికి జగన్ రూ.30 వేలు బాకీ పడ్డాడు. చరిత్రలో మొదటి సారిగా కిడ్నీ, తలసేమియా బాధితులకు, మత్య్సకారులకు, డప్పుకళాకారులకు 50 ఏళ్లకే ఫించన్  ఇచ్చాం. హిజ్రాలకు ఫించన్ ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే.  

*ఉత్తరాంధ్రలో పెత్తందార్ల పెత్తనం ఏంటి*

ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. వెనుకబడిన వర్గాలు అధికంగా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో మళ్లీ బీసీల రాజ్యం వస్తుంది. టీడీపీ - జనసేన ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుంది. ఉత్తరాంధ్రకి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ సామంతరాజులుగా నియమించారు. బీసీలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఈ పెత్తందార్ల పెత్తనం ఏంటి? ఉత్తరాంధ్ర నుంచి బీసీ నాయకుడు ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రిని చేసిన ఘనత టీడీపీది. కిమిడి కళా వెంకట్రావు సహా అనేక మందికి మంత్రి పదవులిచ్చాం. ఉత్తరాంధ్రకు నీళ్లు, పరిశ్రమలు తెచ్చి మౌళిక సదుపాయాలు కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తాం. 

* ఉత్తరాంధ్ర ఆస్తులపైనే శ్రద్ద..ప్రజలపై కాదు*

విశాఖ కేంద్రంగా అన్ని ప్రాంతాల్ని అభివృద్ది చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తాం. టీడీపీ హయాంలో రూ.1,600 కోట్లు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. కానీ నేడు ఒక్క రూపాయైనా జగన్ ఖర్చు చేశాడా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? మద్దువలస, తారకరామ, తోటపల్లి, వంశధార వంటి ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలో పూర్తి చేశాం. నేడు అన్ని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశారు. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆప్ సోర్స్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. తోటపల్లిని ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి చివరి ఆయకట్టు దాకా నీరిస్తాం. జగన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఉన్న ఆస్తులపై తప్ప ప్రజలపై ప్రేమ లేదు. విశాఖలో  రూ.40 వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడితే అక్కడ జగన్ కన్ను పడుతుంది. మెడపై కత్తి పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటున్నారు. 

*భూరక్షణ చట్టం కాదు..భక్షణ చట్టం*

మన పట్టా పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? ఆయనేమైనా మీతాత తరపు బంధువా? లేక మీ అమ్మమ్మ తరపు బంధువా? నిద్ర లేస్తుండగానే ఆయన బొమ్మ చూడడానికి ఆయనేమైనా వెంకటేశ్వరస్వామా? సర్వే రాళ్లపై బొమ్మలు ఏంటి? జగన్ తీసుకొచ్చింది భూ రక్షణ చట్టం కాదు..భక్షణ చట్టం. అది వస్తే మీ భూములు మీ పేర్ల మీద ఉండవు. రికార్డులు తారుమారు మీ భూముల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లో దీన్ని ఆమోదించం. టీడీపీ అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తాం. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెచ్చాం..కానీ దాన్ని నేటికి పూర్తి చేయలేదు. బోగాపురం ఎయిర్ పోర్ట్ ను పూర్తి చేయలేదు. భావనపాడు పోర్టును నేను ప్రారంభిస్తే పేరు మార్చి మళ్లీ శంకుస్దాపన చేసి అమ్మకునే పరిస్థితికి వచ్చారు. విశాఖను ఆర్థిక రాజదానిగా, ఐటీ రాజధానిగా, టూరిజం క్యాపిటల్ గా తయారు చేయాలని నేను సంకల్పిస్తే జగన్ రెడ్డి దాన్ని గంజాయి, క్రైమ్ క్యాపిటల్ మార్చారు. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశాం. జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. వైసీపీ సినిమా అయిపోయింది. వైసీపీ ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుంది. వచ్చే ఎన్నికలు 5 కోట్ల ప్రజలకు జగన్ కి మద్య యుద్ధం. ఈ యుద్దంలో రాష్ట్ర ప్రజలే గెలవాలి. 

*మీ ఇంట్లో చెత్త పక్క ఇంట్లో బంగారం అవుతుందా?*

ఓటమి భయంతో జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం జగన్ రెడ్డి. కొంతమంది మంత్రులకు కూడా సీటివ్వలేదు. కోడిగుడ్డు మంత్రికి సీటు ఇవ్వలేవు. ఆయన సొంత నియోజకవర్గంలో చెత్త అని తేలాక ఆయన్ని మరొక నియోజకవర్గంలో వేస్తే ప్రజలు అంగీకరిస్తారా? మీ ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా? రాజాం ఎమ్మెల్యేని పాయకరావుపేటకి మార్చారు. కానీ అగ్రవర్ణాల వారిని మాత్రం మార్చకుండా జగన్ బతిమాలాడుకుంటున్నాడు. బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని జగన్ రెడ్డి అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఇదేనా? 80 మంది ఎమ్మెల్యేలు మార్చుతామంటున్నారు, 80 చోట్ల వైసీపీ ఓడిపోతుందంటే  ప్రభుత్వం టీడీపీ జనసేనదే మరో డౌట్ లేదు.  దొంగ ఓట్లపై మేం ఈసీకి ఫిర్యాదు చేస్తే  వాళ్లే ఆశ్యర్యపోయారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. మీ ఓటుకు కూడా రక్షణ లేదు. ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండండి. యువత సైకిలెక్కి ప్రజల్ని చైతన్యం చేయాలి. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వారికి ఎమ్మెల్యే , ఎంపీ సీట్లు ఇస్తారంటా. ఇది రోత రాజకీయం కాదా? 

*జగన్..నీ ఉద్యోగాన్ని ప్రజలు ఊడగొడతారు*

బొబ్బిలిలో ఎమ్మెల్యే చినఅప్పలనాయుడు ప్రభుత్వ భూముల్ని యదేచ్చగా కబ్జా చేస్తున్నారు. అంగన్ వాడీలు ధర్నా చేస్తుంటే ఒళ్లు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నారు. అంగన్ వాడీలకు రూ.4 వేలు ఉన్న జీతం రూ.12 వేలకు పెంచిన  ఘనత టీడీపీదే. జీతాలు పెంచమంటే ఎస్మా చట్టంతో వాళ్ల ఉద్యోగాలు తీసేస్తారా? జగన్ రెడ్డి...రేపు నీ ఉద్యోగం ఊడగొట్టేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీల న్యాయబద్ద డిమాండ్లు తీర్చుతాం. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని  ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యేపై జగన్ రెడ్డి ఎందుకు కేసు పెట్టలేదు? ఇంకెంతమందిని బలి తీసుకుంటారు?

*టీడీపీ-జనసేన వచ్చాక జిల్లా సమస్యలు పరిష్కారం*

 టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయనగరం కార్పోరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరింస్తాం. టీడీపీ హయాంలో నిర్మించిన 4 వేల టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తాం. పార్వతీపురంలో షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కరిస్తాం. బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు చేస్తాం. పాడంగి మండలంలో వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తాం. నెల్లిమర్లలో మత్య్సకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తాం. రాజాం - పాలకొండ ప్రధాని రహదారి నిర్మిస్తాం. నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్ధశ తీసుకొస్తా. రాష్ట్రాన్ని పునర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సంక్రాంతికి స్వర్ణ యుగం కోసం సంకల్పం చేయండి. పిల్లలకు ఉద్యోగాలు రావాలి. రైతు రాజ్యం రావాలి. పేద, వెనుకబడిన వర్గాలకు భవిష్యత్ ఉండాలని సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత టీడీపీ - జనసేన తీసుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్రానికి స్వర్ణయుగం తీసుకురావాలి’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Comments