దేశవ్యాప్తంగా హాజరయిన డెలిగేట్స్ గ్రామవ్యవస్థ అద్భుతమని కితాబు.*దేశవ్యాప్తంగా హాజరయిన డెలిగేట్స్ గ్రామవ్యవస్థ అద్భుతమని కితాబు**15 వ ఫైనాన్స్ నిధులు 1000 కోట్లు విడుదల : రాష్ట్ర పంచాయితీ రాజ్ కమిషనర్ శ్రీమతి సూర్యకుమారి* 


తిరుపతి, జనవరి 20. (ప్రజా అమరావతి): ఈ నెల 18 నుండి మూడురోజులపాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పంచాయితీరాజ్ కార్యశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సచివాలయ వ్యవస్థ అధ్బుతమని కితాబు ఇచ్చారని రాష్ట్ర పంచాయితీ రాజ్ కమిషనర్ శ్రీమతి సూర్యకుమారి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కమిషనర్ మీడియాకు వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ రెండురోజుల పాటు పంచాయతీ రాజ్ వ్యవస్థ హేల్తీ విలేజ్ , సుస్థిర అభివృద్ది లక్ష్యాల పై కార్యశాల నిర్వహణ చేపట్టి ఇతరరాష్ట్రాల తో సరిచూసి  ఇంకా మన రాష్ట్రంలో ఏమైనా చేయలసినవి వున్నాయని పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుందని, మరాష్ట్రంలో అమలవుతున్న డిబిటి విధానం, పథకాలు పించన్ల డోర్  డెలివరీ వంటివి బాగున్నాయని వ్యక్తంచేసారని అన్నారు. అలాగే ఆతిధ్యం కూడా ఎలాటి లోటు లేదని తెలిపారని అన్నారు. నేడు క్షేత్రస్థాయిలో పర్యటన గ్రామసచివాలయ వ్యవస్థ పరిశీలనకు 4 బృందాలుగా పర్యటించారని తెలిపారు. ఎల్లమండ్య౦ లో మహారాష్ట్ర గుజరాత్ , దాదర్ నాగర్ హవేలీ మరియు డామన్ డయ్యు , పచ్చిమ బెంగాల్ తమిళ్ నాడు , పుదుచ్చేరి డెలిగేట్స్ 53 మంది, తనపల్లి లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ , మేఘాలయ, త్రిపుర , కర్ణాటక, సిక్కిం డెలిగేట్స్ 47 మంది, చెర్లోపల్లి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ , మధ్యప్రదేశ్ , జార్ఖండ్ , తెలంగాణా డెలిగేట్స్ 48 మంది, తొండవాడ చత్తీస్గడ్ , జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, కేరళ డెలిగేట్స్ 49మంది బృందాలుగా సచివాలయ వ్యవస్థ, రైతుబరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్స్ అధికారులతో, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి పనితీరు తెలుసుకున్నారు.

కమిషనర్ మరో ప్రకటనలో 15 వ ఫైనాస్స్ కమిషన్ నిధులు రూ.1000 కోట్లు నేడు విడుదల అయ్యాయని , పంచాయితీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో విడుదల అయిన రూ.1000 కోట్లు ఇంకా 18 శాతం ఖర్చు చేయలేదని ఆలస్యం లేకుండా ఇప్పటికే శిక్షణ ఇచ్చామని సర్పంచులు, సెక్రటరీలు పంచాయితీల అభివృద్దికి వెచ్చించాలని సూచించారు. 

డెలిగేట్స్ అభిప్రాయలు:

 1. శ్రీమతి ప్రియా రాజేష్ జంగ్లె, సర్పంచ్,  మధ్యప్రదేశ్ 2.హన్స్ రాజ్ , సర్పంచ్ హిమాచల్ ప్రదేశ్ , 3. సంతోష్ కుమార్ దూబే , సర్పంచ్ జార్ఖండ్ , 4. డా.సచిన్ జాదవ్ , జిల్లా టిబి ఆఫీసర్ , రాయఘడ్ జిల్లా మహారాష్ట్ర , 5. రింకు గుస్సామి, సర్పంచ్, అస్సాం, 6. పబిత్ర కె. జాయింట్ డైరెక్టర్ , పి ఆర్ అండ్ ఆర్ డి , అస్సాం  క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ఇక్కడి వ్యవస్థ ను ఒక రోల్ మోడల్ గా తీసుకోవచ్చని, మా రాష్టాల్లో ఈ వ్యవస్థను వివరించి గ్రామీణ ప్రజలకు సేవలందించే దిశగా ప్రయత్నం చేస్తామని, ఈ రెండురోజుల ఆతిధ్యం బాగుందని, కార్యశాల వంటివి మాకెంతో ఉపయోగపడిందని  వారి భాషల్లో వివరించారు. 

క్షేత్రస్థాయి పర్యటనలో ఆయా పంచాయితీల సర్పంచులు, ఎంపి పి లు , వార్డు మెంబర్లు , సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, వైద్యసిబ్బంది , అధికారులు పాల్గొన్నారు.


Comments