రాబోవు రోజుల్లో సర్పంచులు సలహాలు ఇచ్చేలా వుండాలి.



రాబోవు రోజుల్లో సర్పంచులు సలహాలు ఇచ్చేలా వుండాలి.


వికసిత్ భారత్ లక్ష్యం 2047 కు అగ్రగామిగా  నిలవాలి: కేంద్ర సహాయ మంత్రి 


సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో సంక్షేమం, అభివృద్ది సాదిస్తున్నాం : రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి 


తిరుపతి, జనవరి 18 (ప్రజా అమరావతి): పంచాయితీ సర్పంచ్ అభివృద్ది బారత దేశంలో కీలకవ్యక్తి అని, మన 100 ఏళ్ల స్వాతంత్ర  భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం -2047  అభివృద్ది సాధించి ముందు నిలవాల్సిన అవసరం ఎంతైనా వుందని కేంద్ర పంచాయితీ రాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్  అన్నారు. గురువారం ఉదయం స్థానిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ఆరోగ్యకర గ్రామం అనే అంశంపై మూడు రోజుల జాతీయ వర్క్‌ షాప్‌ను పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రారంభించారు. 

కేంద్ర సహాయమంత్రి మాట్లాడుతూ గ్రామా సర్పంచుల్లో ఆత్మవిశ్వాసం నిండుగా వుండాలని అభివృద్ది అనే భవంతిలో కీ లాంటివాడని , భవంతి పెద్దదని దాని ద్వారం చిన్నదని దానుకున్న తాళం మరింత చిన్నదని దాని తెరిచే కీ సర్పంచ్ లాంటివాడని అన్నారు. రానున్న 2047 నాటికి వంద ఏళ్ల స్వాతంత్ర భరత దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో,   భారత ప్రధాని సంకల్పంతో అభివృద్దిలో పథంలో నిలవనున్నదని అన్నారు. గ్రామాల్లో సర్పంచులు, స్వయం సహాయక మహిళా సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని అయినా ఇంకా ఎన్నో గ్రామాలు  అభివృద్ది చెందాల్సి వుందని  అన్నారు. ఆత్మ విశ్వాసంతో సర్పంచులు అభివృద్ధికి నాంది పలకాలని, ఒక చెవిటి వాడిలా ముందుకెళ్ళాలని ఆమాట అనడానికి కారణం వుందని ప్రమాదం అనితెలిసినా కొండ పైకి ఎక్కుతున్న వ్యక్తిని ఆపేప్రయత్నం చేస్తుంటే ఆవ్యక్తి కొండను సునాయాసంగా ఎక్కి దిగుతాడని, వద్దనా ఎందుకు వెళ్ళావని వారిస్తే నాకు చెవుడు వుందని అందుకే మీమాటలు వినబదలేదని అయినా సాదించానని చెపుతాడని ఆ స్పూర్తి తో అభివృద్ధికి పునాదులు వేయాలని అన్నారు. ఆరోగ్యం, ఆయుష్, స్త్రీలు, శిశు అభివృద్ధి, తాగునీరు,  పారిశుద్ధ్యం, యువజన వ్యవహారాలు, పాఠశాల విద్య మొదలైన శాఖల కార్యదర్శుల క్రియాశీల సహకారంతో గ్రామ ఆరోగ్య ప్రణాళిక తయారీపై గ్రామ పంచాయతీలు దృష్టి సారించాలి అందుకే వివిధ రాష్ట్రాల వారు పాల్గొనే  ఈ కార్యశాలలల్లో ఒక సమాదానం లభిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. దాహం వేసినపుడు నీళ్ళకోసం ఆలోచించడం సరికాదని మన తాతలు నదులు, నీటి కాలువలు చూస్తె , మన తండ్రులు బావులు , మనం బోర్లుల్లో నీళ్ళు చూస్తున్నాం, మన పిల్లలు బాటిల్స్ చూస్తారు, ఆతరువాత కన్నీళ్ళు చూడాల్సి ఉంటుందని గతంలో కట్టెల కోసం అడవులకు వెళ్ళిన విధంగా నీళ్ళకోసం వెళ్ళాల్సి వస్తుందని గ్రహించి గ్రామీణ వాసులకు సుద్దజలం అందించాలని మన పోరాడని 2 వేల కోట్లతో జలజీవన్ మిషన్ ఏర్పాటుతో గ్రామాల్లోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నారని అన్నారు. కరువు నుండి మనం మానవత్వం నేర్చుకోవాలి, సంపద వారసత్వంతో రాదు, కష్టించి పనిచేయాలి అన్నారు. నా హర్యానా రాష్ట్ర  పర్యటనలో  ఒక ముస్లిం ఆయుష్ మాన్ భారత్ వల్ల నాకాళ్ళు బాగుచేసుకున్న నేడు నడిచి నీదగ్గరకు వచ్చా అని సంతోషంతో చెప్పారు, అలాగే మహిళా సంఘ సభ్యురాలు తన సంఘంలో డబ్బుతీసుకుని భర్తకు రిక్షా కొనిచ్చా అన్నది, భార్య భర్తకు ఉపాధి కల్పించింది అన్నారు. మరొక రాష్ట్ర పర్యటనలో ఒక గ్రామంలోకి వెల్లేచోట ఆవూరి  ఐ ఎ ఎస్ లు, ఉన్నతాధికారుల  జాబితా బోర్డు కనిపించింది ఆసర్పంచ్ ని అడిగితే వారి స్పూర్తి గ్రామప్రజలకు రావాలి అన్నారు. అందుకే పంచాయితీరాజ్ గ్రామ స్వరాజ్యం దిశగా పయనిచాలని ఆశిస్తున్నానని అన్నారు. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయితీలపై ప్రత్యెక శ్రద్ధ పెట్టారని , గ్రామసచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు , అంగన్ వాడిల ఏర్పాటు తో అభివృద్ది, సంక్షేమం దిశగా , ఆరోగ్యసురక్ష , పౌష్టికాహార అందిస్తూ సుస్థిర అభివృద్ది లక్ష్యాలు సాదిస్తున్నతని ఆరోగ్య గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, రోడ్లు, మురికి కాలువలు  నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం లో మెటీరియల్ కాంపౌండ్ నిధులు అనుసందానంచేసి నిర్మాణాలు చేపట్టామని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కి త్రాగునీరు అందించడం జరిగిందని అన్నారు. పారిశుద్యం వైపు దృష్టి సారించి ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దామని వివరించారు. 

ఈ సమావేశంలో స్వాగతం ఉపన్యాసం రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి  శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, వందన సమర్పణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి చేపట్టి అతిధులను ఘనంగా సత్కరించారు. ఉమ్మడి జిల్లా జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, సి ఇ ఓ ప్రభాకర రెడ్డి ,  సెంట్రల్ జాయింట్ సెక్రటరీ పంచాయితీ రాజ్,వివేక్ భరద్వాజ్, అదనపు కార్యదర్శి డా. చంద్ర శేఖర్ కుమార్ , జాయింట్ సెక్రెటరీ వికాస్ ఆనంద్ , జేసి శుభం బన్సల్ , మన రాష్టంతో పాటు వివిధ రాష్ట్రాల ,కేంద్ర పాలిత ప్రాంతాల 32 ప్రాంతాలనుండి సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, స్వయంసహాయక సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments