రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.*రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం*


*రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు**టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రారావు*


*టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక*


*అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక*


*అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని,  వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రాజకీయాల్లో లేకుండా ఉంటే రాష్ట్రంలో ఇంతటి విధ్వంసం జరిగేది కాదని, పోలవరం, రాజధాని అమరావతిని నాశనం చేశాడని దయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అన్నమాటే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం 5 ఏళ్లు కష్టపడతారు..కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంజాయ్ చేసి, రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.  వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు దాడి వీరభద్రారావు, ఆయన తనయులు దాడి రత్నాకర్, దాడి జైవీర్, బాపట్ల జిల్లా, కర్లపాలెం జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, అనంతపురంనకు చెందిన డా.కె.రాజీవ్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘‘మరో వంద రోజల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా..1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఎంతోమంది సీఎంలను చూశాను గానీ  జగన్ లాంటి దారుణమైన ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 

*రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు..దోపిడీలే*

జగన్ సీఎం అయ్యాక రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారు.. 75 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలను జగన్ విధ్వంసం చేశాడు. రాష్ట్రంలో రోడ్లు, వ్యవసాయం, విద్య, వైద్యం అన్నీ దెబ్బతిన్నాయి. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై ఎవరు మాట్లాడినా దాడులు చేసి కేసులు పెట్టారు. ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలే. ప్రజలు అసహ్యించుకుంటుంటే జగన్ కొత్తగా ఆలోచించి ఎమ్మెల్యేలను మార్చుతున్నాడు. ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేసి, ప్రజల మద్ధతు కోల్పోతే నీ ఇంటెలిజెన్స్ ఏమి చేసింది.? తప్పు చేసిన ఎమ్మెల్యేలను ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా.? ఇది తప్పు అని చెప్పారా.? వాళ్లకు దొరికింది వాళ్లు దోచుకున్నారు. నువ్వు చేసిన సర్వేలో నువ్వే లాభం లేదని అనుకుంటున్నారు జగన్. పరిశ్రమలు తరిమేశాడు. రోడ్లన్నీ పాడైపోయాయి. ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు..విపరీతంగా అప్పులు చేశాడు. ఇష్టారీతిన అవినీతి చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జగన్ రాజకీయాలను అపవిత్రం చేశాడు. మంచి, చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్. రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలోకి నెట్టారు. వ్యవస్థలు సక్రమంగా ఉండి..నడిపించే వ్యక్తులు సమర్థులుగా ఉంటే దాని ఫలితాలు సామాన్యులకు దక్కుతాయి. 

*టీడీపీ ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలు రద్దు*

స్కూలు బిల్డింగులకు రంగులు వేయడం అభివృద్ధికాదు...చదువుకున్న విద్యార్థి మేథావి అయి, మంచి ఉద్యోగం సాధిస్తే అది నిజమైన అభివృద్ది. పైపైన రంగులు దుద్ది అదే అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ కూడా ఇచ్చింది..మేం ప్రవేశపెట్టిన 100 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.  స్కాలర్ షిప్ లు టీడీపీ హయాంలో 16 లక్షల మందికి ఇస్తే..దానికి విద్యా దీవెన అని పేరు పెట్టి 10 లక్షలకు కుదించి బటన్ నొక్కుతూ సొంత పత్రికకు ప్రకటనలిచ్చుకుంటున్నాడు. చదువుకోవాలనుకునే ప్రతి విద్యార్థికీ విదేశాల్లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తేనే నిజమైన విద్యాభివృద్ధి..అదే టీడీపీ చేసి చూపింది. విదేశీ విద్య కింద ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందించాం. భయంకరంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. నా జీవితంలో ఇంతలా మార్పులు వినలేదు..చూడలేదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి..జవాబుదారీ తనం తీసుకురావడానికి. ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల్ని లీడ్ చేయాలి. పుచ్చలపల్లి సుందరయ్యను ప్రజలు ఇప్పుడూ గుర్తంచుకుంటున్నారు. 

*రాజకీయాలకు నూతన నిర్వచనం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్*

తెలుగుజాతి బతికున్నంతకాలం గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్. 60 ఏళ్ల వయసు తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు..ఆయన జీవితం ఒక ఆదర్శం. పదవి, డబ్బులు కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలని, నీతివంతమైన రాజకీయం చేయాలని వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం నేర్పించారు ఎన్టీఆర్. అభివృద్ధి-సంక్షేమాన్ని పద్ధతిప్రకారం నడిపించారు. రిషికొండ లాంటి చారిత్రక కొండను తవ్వేసి, ప్యాలెస్ కట్టేశాడు. ఈయనే సీఎంగా శాశ్వతంగా ఉంటాడనుకున్నారు. రూ.500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుని ఏ విధంగా సమర్థించుకుంటావు.? మా ఇంటికి వంద గజాల చిన్న రోడ్డు వేస్తే ప్రతి రోజూ విమర్శించిన వ్యక్తి...తన ఇంటికి 4 లైన్ల రోడ్డు వేసుకున్నాడు. రాజధాని విశాఖ తీసుకెళ్తానంటే కోర్టులు కూడా ముట్టికాయలు వేశాయి. అమరావతి అంశాన్ని ఏప్రిల్ లో వింటామని సుప్రీంకోర్టు చెప్పింది..అప్పటికి జగన్ ఉండరు..మళ్లీ టీడీపీనే వస్తుంది. నువ్వు రాజధాని మార్చలేవు..విశాఖ పోలేవు. కానీ రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశావు. సాధ్యం కాదని తెలిసి కూడా వందల కోట్లు లాయర్లకు విచ్చిలవిడిగా డబ్బులిచ్చి దుర్వినియోగం చేశాడు. 

*నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ...వారినే మార్చేస్తున్నాడు*

మొన్న 11 మందిని, నిన్న 27 మందిని మార్చాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు..కానీ వారినే మార్చాడు. నేను పుల్లను నిలబెట్టినా గెలుస్తారు అన్నావ్ కదా...మరి ఇప్పుడున్నవాళ్లను పెట్టి ఎందుకు గెలిపించలేవు.?. సీఎం పదవి కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఎవరన్నా రావాలన్నా భయపడిపోతున్నారు. ఆస్తులను రాసిస్తావా లేదా అని మెడపై కత్తిపెట్టి రాయించుకుంటున్నారు. విశాఖలో యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు..అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.? శాంతి భద్రతల గురించి సీఎం పట్టించుకుంటున్నాడా.? నేను సీఎంగా ఉన్నప్పుడు పిడుగురాళ్లలో అత్యాచారం జరిగితే టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి నిందితుడు భూమ్మీద ఎక్కడున్నా పట్టుకురమ్మంటే..విషయం తెలుసుకున్న నిందితుడు తెలుసుకుని ఉరేసుకుని చనిపోయాడు. పాలకులు సమర్థులుగా ఉంటే మిగిలిన వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేస్తారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే విమర్శలు చేస్తారా అని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. 

*చూసుకుంటే కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు*

రాష్ట్రంలో పండిన గంజాయి పక్క రాష్ట్రాలకు వెళ్లడంతో వాళ్లూ ఏపీని తిడుతున్నారు. బాధ్యత కలిగిన నాయకులందరూ ఆలోచించాలి. మనం చూసుకుంటూ కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 5వ తేదీ నుండి రా..కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలకు ఏమి చేస్తానో చెప్పేందుకు 25 పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తా. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, గురుకులాల సిబ్బంది రోడ్లపైకి వస్తే వాళ్లని బెదిరిస్తున్నారు. న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే సమర్థిస్తాం..వాటిని పరిష్కరించేందుకు ముందుకొస్తాం.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతకముందు పార్టీలో చేరిన వారిలో చీరాలకు చెందిన క్రీడా మాజీ అధికారి నక్కల అర్జున రావు, హైకోర్టు న్యాయవాది సింగయ్య గౌడ్, పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లతో మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందిరినీ చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యేలు, పీలా గోవింద్, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, యరపతినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, పుట్టా సుధాకర్ యాదవ్, చీరాల ఇంఛార్జ్ మాలకొండయ్య యాదవ్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, శ్రీరామ్ చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
Harshavardhan selected for Chennai Super Kings team
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image
India is on high-growth trajectory to achieve its development goals by 2047: Minister Hardeep S Puri.