ప్రమాదములకు ఆస్కారం లేకుండా ఉండుటకు డ్రైవర్స్ కు కండక్టర్స్ సహకరించాలి.

            

తెనాలి (ప్రజా అమరావతి);

ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో


భద్రత వారోత్సవాల (15.01.2024 to 14.02.2024) సందర్భంగా ఈరోజు అనగా 25.01.2024 తేదీన  శ్రీ రాఘవ కుమార్ ( MVI)  తెనాలి డిపోనకు విచ్చేసినారు. ఈ సందర్భంగా తెనాలి డిపో డ్రైవర్లు, కండక్టర్లు ,మెకానిక్ సిబ్బంది తదితరులకు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా వారు రోడ్డు భద్రత ఉత్సవాల గురించి మాట్లాడుతూ రోడ్డుపై వాహనములు నడుపునప్పుడు సిగ్నల్ గుర్తులను గమనించి డ్రైవింగ్ చేయాలని బస్సు ఆపునప్పుడు పూర్తిగా లెఫ్ట్ సైడ్ కి తీసి ఆపాలని, ఎటువంటి ప్రమాదములకు ఆస్కారం లేకుండా డ్రైవింగ్ చేయాలని తెలియపరిచినారు అదే విధంగా గత సంవత్సరముతో పోల్చుకుంటే ఈ సంవత్సరము డిపోలో యాక్సిడెంట్లు  తగ్గినా యని పూర్తిగా యాక్సిడెంట్లే లేకుండా జీరో యాక్సిడెంట్ ఉద్దేశంతో డ్రైవింగ్ చేయాలని తెలియపరిచినారు. గ్యరేజ్ మెకానిక్ సిబ్బంది ఉద్దేశించి బ్రేక్ డౌన్ లేకుండా వాహనములు మైంటెనెన్స్ చేయాలని డ్రైవర్స్ కు గుడ్ కండిషన్లో ఉన్న మంచి వాహన ము ఇచ్చినట్లయితే వారు హ్యాపీగా ఉద్యోగం చేస్తారని  తెలియపినారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్  మాట్లాడుతూ  ఎటువంటి ప్రమాదములకు ఆస్కారం లేకుండా ఉండుటకు డ్రైవర్స్ కు  కండక్టర్స్ సహకరించాలని


ప్రతి ఒక్క డ్రైవర్  డ్యూటీ కి అర్ధగంట ముందు వచ్చి బస్సు ను సక్రమంగా చెక్ చేసుకుని ప్రశాంతంగా డ్యూటీకి వెళ్లాలని, డ్యూటీ చేసే సమయంలో ఆవేశములకు లోను కాకుండా  ప్రశాంతంగా డ్యూటీ చేయాలని తెలియపరిచినారు. ఈ సందర్భంగా  MVI ని శాలువాతో సత్కరించడం అయినది.


Comments