జగన్ కు ఓటమి అర్థమై సంతోషంగా దిగపోతానంటున్నాడు.*జగన్ కు ఓటమి అర్థమై సంతోషంగా దిగపోతానంటున్నాడు


*


*రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది*


*పోయేటప్పుడు ఇచ్చే నోటిఫికేషన్‌తో ఎవరిని మోసం చేయడానికి?*


*ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదు*


*నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన  వారిని వదలను*


*ఖబడ్దార్ వైసీపీ గూండాల్లారా! జాగ్రత్తా..*


*ఉరవకొండ రా! కదలి రా! సభలో నారా చంద్రబాబు నాయుడు*


ఉరవకొండ  (ప్రజా అమరావతి):-రాష్ట్రాన్ని ఎలా కాపాడు కోవచ్చో మీకు తెలియజేయడానికి ఉరవకొండకు వచ్చాను. మీ ఉత్సాహం చూస్తుంటే ‘‘మేమంతా మీ వెనుకే ఉన్నాం. మీరు ముందు నడవండి, మేము మీ వెనుకే నడుస్తాం” అని మీరు చెబుతున్నట్లుగా నాకు అర్థమౌతుంది.  ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నాను. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోంది. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడు. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. జగన్ సభలకు స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదు. జనంలోని చైతన్యాన్ని బట్టి ఈ విషయం స్పష్టమౌతోంది. మీ ఉత్సాహాన్ని జగన్ చూశాడంటే ఆయనకు నిద్ర పట్టదు. జగన్ కు 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. ‘‘నువ్వు మాకు వద్దు’’ అంటున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి 14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఇటీవలే జగన్ తన ఓటమిని అంగీకరించాడు. జగన్ కు తాను ఓడిపోతున్నట్లు అర్థమైపోయింది. ఆయన ఓడిపోతున్నాడని సర్వేలు సైతం వచ్చాయి. జగన్ కు ఉన్న గర్వమంతా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడు. అప్పుడు మనిషిలో అహంభావం పూర్తిగా ఉండేది. 2022లో ప్లీస్ నన్ను నమ్మండని బ్రతిమిలాడుకున్నాడు. 2023లో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను మిమ్మల్నే నమ్ముకున్నానని అన్నాడు. 2024లో నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు. ఖేల్ ఖతమ్ అని జగనే ధృవీకరించుకున్నాడు.


అమరావతిలో 25 ఏళ్లకు ముందు మీ భూముల విలువ ఎంత? నేను వచ్చాక ఎంత అయ్యాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రాంతంలోని రైతుల బిడ్డలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా మారారు. వ్యవసాయ రంగాన్ని మోడరన్‌గా మార్చాలనుకున్నాను. జగన్ వచ్చి దానికి అడ్డు తగిలాడు. నేను ఊహించినట్లు జరిగివుంటే ఇరిగేషన్ ఎంతో అభివృద్ది జరిగి ఉండేది.  50 వేల ఎకరాల్లో ఇరిగేషన్ అభివృద్ది చెందేది. ఈ ఇరిగేషన్ పూర్తైవుంటే అనంతపురం జిల్లాలో ప్రతి రైతు బాగుపడేవాడు. నేను తపించేది నా కోసం కాదు రైతుల కోసం. ఒకప్పుడు దేశానికి కూరగాయలు సరఫరా చేసిన ఏకైక జిల్లా అనంతపురం జిల్లా. వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మొద్దు. టీడీపీ అధికారంలో ఉన్నప్పపుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇక్యూమెంట్లను పంపిణీ చేశాం. జగన్ వచ్చి వాటన్నింటిని నాశనం చేశాడు. రైతులకు వస్తు సామాగ్రి ఇచ్చాం. ముఖ్యమంత్రికి బుద్ది లేదు, రైతులకు ఇచ్చిన ఇక్యుప్‌మెంట్‌ల వల్ల  30 కోట్లు వృధా అయింది. ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియదు. అందుకే భీమా పథకాన్ని తీసేశాడు. మళ్లీ భీమా పథకం తెచ్చే బాధ్యత టీడీపీ-జనసేనలది.

ఎక్కడ పోయినా జనం ఉత్సాహం, అభిమానం చూపిస్తున్నారు.  వైసీపిని భూస్థాపితం చేయాలి. డీఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఇంకా ఎవరిని మోసం చేస్తారు?. మేం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలిచ్చా. మద్యం షాపులతో మంది ప్రాణాలు తీస్తున్నాడు. టీడీపీకి, వైసీపీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలి. మేం విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. సెంట్రల్ యూనివర్శిటీలు తెచ్చాం. అనంతపురంలో కియా మోటార్ పరిశ్రమ పెట్టి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేశాం. ఇక్కడ తయారైన కార్లు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. అమర్ రాజాను తరిమేశారు. మేం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చాం. వాటిని జగన్ రెడ్డి తరిమేశాడు. యువతకు జాబులు లేకుండా చేశాడు. జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకిలెక్కండి. టీడీపీ-జనసేన జెండా పట్టండి. మీ జీవితాల్లో వెలుగు తెస్తాం. మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాను. మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే నేను సిద్ధం. మీరు పది అడుగులు ముందుకు వేయండి, మీ కోసం నేను వంద అడుగులు ముందుకు వేస్తా. ఇంకో 25 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. అందుకోసం ఏమి చేయాలో ఆలోచిస్తున్నాను. తెలుగు జాతి నెం.1 జాతిగా ఉండాలి. అదే నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేందుకు యువత సిద్ధమా? ఒకప్పుడు రోడ్లు ఉండేవి కాదు, మేం వచ్చాక రోడ్లు వచ్చాయి. సెల్ ఫోన్ వచ్చిందంటే దానికి కారణం నేనే. దేశంలో ప్రత్యేకంగా తెలుగుజాతిలో పేదరికం లేకుండా చూడడమే నా లక్ష్యం. జనరేషన్ మారుతున్నాయి. తలరాతలు మారాలి. 

వైసీపీ కమీషన్ల కోసం తప్పడు పనులు చేశారు. యువతకు హామీ ఇస్తున్నా. 4 లక్షల 25వేల ఉద్యోగాలిస్తాం. అనేక కంపెనీలు, పరిశ్రమలు మరలా తీసుకవస్తాం. యువత పనిచేసుకునేందుకు వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుడతాం. ఉద్యోగాలే మీ డోర్ కొట్టేలా చేస్తాను. అమ్మా నాన్న పైన ఆధార పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ పెద్దగా ఉంటా. అనంతపురంలో కరెంటు కొరత ఉండేది. కానీ సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా కరెంటు కొరత లేకుండా చేశాను. భవిష్యత్తులో కరెంటు చార్జీలు తగ్గిస్తాము గాని పెంచము. వైసీపీని నమ్మి ఓటేశారు. నిండా మునిగారు.


దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారిని, వైసీపీ నాయకులను ఎవర్నీ వదిలి పెట్టను. నల్ల చట్టం(ఏపీ ల్యాండ్ టైట్లింగ్) అనే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చాడు. అది భూ రక్షణ చట్టం కాదు భూ భక్షణ చట్టం. భూమి మీదైతే పట్టాపై జగన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. మీ అమ్మ బంధువా? లేదా మీ దాయాదనా జగన్ రెడ్డి తన ఫొటో వేసుకున్నాడు? ఇంట్లో, పొలంలో, చివరికి మరుగుదొడ్డుల్లో.. ఎక్కడ చూసినా జగన్ రెడ్డి ఫొటోనే. ప్రజల ఆస్తులను తమ హక్కులకై కోర్టుకు కూడా వెళ్ళనివ్వకుండా ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మిమ్మల్ని విముక్తి చేసే బాధ్యత నాది. ఈ ముఖ్యమంత్రి మరలా వస్తే మీ ఆస్తులు మీవి కాకుండా పోతాయి, మనం మాట్లాడితే ప్రాణాలు ఉండవు, ఆడబిడ్డలకు రక్షణ ఉండదు.


తన కోరిక తీర్చలేదని ఓ కిరాతకుడు, దుర్మార్గుడు నడి బజారులో ఆడబిడ్డను కొడితే పోలీసులు కూడా వెళ్ళలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా. మీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆంబోతుల్లారా జాగ్రత్తాగా ఉండండి. ఆంబోతులను నడిరోడ్డులో బట్టలిప్పి ఊరేగించి రోజులు దగ్గర పడ్డాయి. ఆడబిడ్డలకు రక్షణగా మేముంటాం.


జగన్ రెడ్డి బ్రతుకే ఫేక్ బ్రతుకు. నారాసుర రక్తచరిత్ర అని చెప్పాడు, లేని తిరుమల వెంకటేశ్వరునిపింక్ డైమెండ్‌ను మా ఇంట్లో ఉందన్నాడు. నేను కోర్టుకు వెళ్తే కేసును విత్ డ్రా చేసుకుంటాన్నాడు. వెనక్కి తగ్గకుండా నేను ఇంప్లీడ్ అయ్యాను. కోడి కత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడేమో వైఎస్ కుటుంబాన్ని నేను చీలిస్తున్నాని అంటున్నాడు. భార్య భర్త కాపురం చేయకపోతే దానికి కూడా కారణం నేనే అని అంటున్నావు. సిగ్గు లేదు మీకు? ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకువస్తున్నారంటే నేనంటే ఎంత భయమో అర్థమవుతుంది. వైసీపీ నాయకులు నేనంటే భయమేసి డైపర్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితికి వచ్చారు. వైసీపీ పని అయిపోయింది. నీ సీటు వద్దు ఏం వద్దని వైసీపీ నాయకులే పారిపోతున్నారు. ప్రజల్లారా! మీరందరూ కన్నెర్ర చేస్తే వైసీపీ నుంచి పోటీ చేయటానికి అభ్యర్ధులే ఉండరు.


నాకు పేపర్ లేదు, టీవీ ఛానల్ లేదని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. అందరూ ఆయనికి వ్యతిరేకమని అబద్ధాల కొరి చెప్తున్నాడు. నువ్వు చేసేది తప్పని జగన్ రెడ్డిని ఎవరైతే ప్రశ్నిస్తే వారిని నాకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్తున్నాడు. ఎప్పుడైతే జనసేన-తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయో అప్పుడే వైసీపీ పతనం ప్రారంభైపోయింది. జగన్ అతని చెల్లులు కొట్టుకొని.. చెల్లి పోయి కాంగ్రెస్‌లో చేరితో దానికి కూడా నేనే కారణమంటున్నాడు. అవును ఈ రాష్ట్రంలో నీ వల్ల నష్టపోయిన ప్రతీ ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్లే. ఉద్యోగం రాని యువత నా స్టార్ క్యాంపెయినర్. నష్టపోయిన రైతు నా స్టార్ క్యాంపెయినర్. డ్వాక్రాలో ఉన్న ప్రతీ మహిళా నా స్టార్ క్యంపెయినర్. 


ఆడబిడ్డల కోసం మహాశక్తిని తీసుకువచ్చాం. ఆంక్షలు పెట్టకుండా తల్లికి వందనం కింద రూ.15,000 ఇస్తాం. ధరలు నియంత్రణ చేస్తాం. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఆడబిడ్డలు ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పింస్తాం. పేదరికాన్ని  నిర్మూలిస్తాం. నన్ను ఆదరించింది మీరు. మిమ్మల్ని గౌరవించింది నేను. అందరి జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఈ రోజు జగన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి అందరూ స్టార్ క్యంపెయినర్ కావలని నేను పిలుపునిస్తున్నా..


అక్రమల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎక్కడ లేఅవుట్ వేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందే. చివరకు సెక్యూరిటీ జీతాల్లో కూడా ఆయనకు వాటా ఇవ్వాల్సిందే. తప్పుడు ఎన్వోసీలు శృష్టించి ఆడబిడ్డల భూములను కొట్టేసిన విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని ఇన్చార్జ్‌గా జగన్ రెడ్డి నియమించాడు. ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఎమ్మెల్యే కేశవ్ వల్లే. మంత్రి ఉషశ్రీ చరణ్ కరప్షన్ క్వీన్. రూ.30 కోట్లు విలువైన సుజలాన్ విండ్ పార్క్‌కు చెందిన భూములను ఆమె డ్రైవర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకుంది. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ లేఅవుట్‌లు వేసి ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. పేదవారికి ఇచ్చే ఇంటి జాగా కోసం 100 ఎకరాలను రూ.6 లక్ష చొప్పున కొని రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వానికి అమ్ముకుంది. అందుకే కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు. ఈ ఊర్లో ఉన్న చెత్త ఏ ఊర్లోను బంగారమవ్వదు. చెత్తను డంప్ యార్డ్‌కు పంపిస్తాం. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మరలా ఫ్యాక్షనిజాన్ని తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ దొడ్డరెడ్డి. పోలీసులను అడ్డపెట్టుకొని ఎగిరెగిరి పెడతున్నాడు. వడ్డీతో సహా చెల్లిస్తాం. శింగనమల నియోజకవర్గాన్ని ముక్కల ముక్కలు చేసిన ఎమ్మెల్యేకు సీటే లేకుండా పోయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు జగన్ రెడ్డికి కాపు కాశాడు. ఇప్పుడు టికెట్ లేదు పో అని జగన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్‌కు సెల్యూట్ పెట్టి బాయ్ బాయ్ చెప్పాడు. గుంతకల్లులో స్టాక్ పాయింటింగ్ పెట్టి వెంకటరామిరెడ్డి ఇసుక అమ్ముతున్నడు. ఎవరు గాలి పీల్చినా కప్పం కట్టాలంటాడు. అనంతపురం ఎమ్మెల్యే రిటైర్మెంట్‌కి వచ్చేసి చిల్లర కొట్టుల్లు కొట్టుకుంటున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, సీఎంలు, చెత్తలు మాకు వద్దు. 


అనంతపురానికి జీవనాడి లాంటి డ్రిప్ ఇరిగేషన్‌ను మరలా తీసుకు వస్తా. బైరవానితిప్ప, గుంతకల్లులో పెండింగ్‌లో ఉన్న లిఫ్ట ఇరిగేషన్, సెంట్రల్ యూనివర్సిటీలను పూర్తి చేస్తాం. గార్లదిన్న, శింగనమలలో ముస్లీలం కోసం షాదీఖానాలు పెడతాం. రద్దు చేసిన సబ్ ప్లాన్‌లు మరలా తీసుకు వచ్చీ వెనుకబడ్డ వర్గాలకు అండగా ఉంటాం. వారిని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకు వచ్చి వారి రుణాన్ని తీర్చుకుంటాను. తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని బీసీలను కోరుకుంటున్నాను. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. మాదిగలకు న్యాయం చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. మైనరిటీలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట ఇరిగేషన్‌ను పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి-పులివెందుల బ్రిడ్జి నిర్మాణ పూర్తి చేస్తాం. ఉరవకొండలో ఉన్న చేనేత కార్మీకులకు చేయూత నందిస్తాం.


నేను ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే జిల్లా అనంతపురం. నాకు గుండెకు దగ్గరగా ఉండే జిల్లా అనంతపురం. ఒకప్పుడు నీళ్లు లేక పంట రాకపోతే మొట్టమొదటి సారి వేరు శనగ పంటకు ఇన్ పుట్ సబ్సిడీను ఇచ్చాం. రైతాంగాన్ని ఆదుకున్నాం. కరువు ఏర్పడినప్పుడు రైతులు పశువులను మేపుకోవటానికి క్యాంపులు ఏర్పాటు చేశాం. అప్పటినుంచి అనంతపురానికి నీళ్లు తీసుకురావాలని నాలో ఆకాంక్ష పెరిగింది. అందుకే హంద్రీ-నీవాను తీసుకువచ్చాం. ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి, పేదరికం లేకుండా చేసి, రైతు తన పొలంలో బంగార పండించే వరకు మీకు అండగా నేన ఉంటా. దాన్ని చేసి చూపిస్తా. ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్‌కు దిమ్మతిరగేలా ఉండాలి. వైసీపీ జెండా భూస్థాపితమై టీడీపీ జెండా ఎగురవేయాలి.


మన భవిష్యత్తే మనందరి ధ్యేయం. నం.1 కమ్యునిటీగా తెలుగు కమ్యునిటీగా మార్చే బాధ్యత నాది. ఇక్కడ పుట్టి ఈరోజు ఐటీ అభ్యర్ధులగా ఉండటానికి పునాదిని వేసింది నేను. హైదరాబాద్‌లో నాలెడ్జ్‌ సెంటర్‌కు పునాది వేసింది నేను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతీ వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకు వచ్చే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకుంటుంది. జగన్ రెడ్డి నువ్వు సిద్ధమైతే నిన్ను దించటానికి మేము సిద్ధం. రాతియుగం పోయి స్వర్ణ యుగం వస్తుంది.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
Harshavardhan selected for Chennai Super Kings team
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image
India is on high-growth trajectory to achieve its development goals by 2047: Minister Hardeep S Puri.