ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా అంబేద్కర్ స్మృతి వనం .

 

విజయవాడ (ప్రజా అమరావతి);

ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా అంబేద్కర్ స్మృతి వనం  


ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చి దిద్దారని రాష్ట్ర ఎస్.సి. కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు.  

విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని గురువారం శ్రీ విక్టర్ ప్రసాద్ పరిశీలించారు.  ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 400 కోట్ల ఖర్చుతో పెడస్టల్ (దిమ్మ) తో కలిపి 205 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం  నిర్మించడం చారిత్రక ఘట్టమని అన్నారు.  ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కళాఖండంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  విజయవాడకే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరలి రానున్నారని అయన అన్నారు.  ఈక్వాలిటీ అఫ్ లిబర్టీ కి  ప్రతిరూపంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని అయన అన్నారు.  అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి వాడైనా అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు.  విశ్వజ్ఞాని, భారతదేశంలో కుల రుగ్మతలను భూస్థాపితం చేసిన అంబేద్కర్ వంటి మహోన్నతమైన వ్యక్తి  విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో చరిత్రాత్మకం అన్నారు.  ప్రతీ ఒక్కరినీ ఆకర్షించే విధంగా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్ లు, లైబ్రరరీ వంటి వాటితో అంబేద్కర్ స్మృతి వనాన్ని సర్వాంగ సుందరంగా ప్రభుత్వం తీర్చి దిద్దిందన్నారు.  ఈనెల 19న పండుగ వాతావరణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని, ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని రాష్ట్ర ఎస్. సి. కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు.   


Comments