కేంద్ర ప్రాయోజిత పధకాల నిధులు సకాలంలో ఖర్చు చేసి మరిన్ని నిధులు రాబట్టండి: సిఎస్

 కేంద్ర ప్రాయోజిత పధకాల నిధులు సకాలంలో ఖర్చు చేసి  మరిన్ని నిధులు రాబట్టండి: సిఎస్ విజయవాడ,31 జనవరి (ప్రజా అమరావతి):కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల( centrally sponsored schemes)నిధులను సకాలంలో ఖర్చు చేయడం ద్వారా కేంద్రం నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను రాబట్టేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పధకాల కింద కేంద్ర వాటాగా  వివిధ శాఖలకు మంజూరైన నిధులకు రాష్ట్ర వాటా కలిపి ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఇంకా కేంద్రం నుండి రావాల్సిన నిధులపై అధికారులతో సమీక్షించారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలకు కేటాయించిన నిధులను వేగవంతంగా ఖర్చు చేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం శాఖల వారీగా కేంద్ర ప్రాయోజిత పధకాలు వాటికి ఖర్చు చేసిన నిధులు,ఇంకా ఖర్చు చేయాల్సిన నిధులు, కేంద్రం నుండి రావాల్సిన నిధులపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.


అంతకు ముందు ఢిల్లీలోని ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రాయోజిత పధకాలు కింద కేంద్రం నుండి రాష్ట్రానికి  విడుదలైన నిధులు,ఇంకా రావాల్సిన నిధులు తదితర వివరాలను వివరించారు.ఈ పధకాలకు సంబంధించి ఆయా శాఖలు పూర్తి వివరాలు సమర్పిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పారు.


ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ ఎండి బాబు ఎ,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్,డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ జె.మురళి,ఎపి టిడ్కో ఎండి శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


అదే విధంగా వర్చువల్ గా  ఆర్థిక,వైద్య ఆరోగ్య, వ్యవసాయ,పిఆర్ అండ్ ఆర్డి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్.రావత్, కృష్ణబాబు,గోపాల కృష్ణ ద్వివేది బి.రాజశేఖర్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి,కమీషనర్ జానకి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే,తదితర అధికారులు పాల్గొన్నారు.Comments