చదువులకొండగా బేతంచెర్ల గోరుమానుకొండ.




బేతంచర్ల, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి);


*చదువులకొండగా బేతంచెర్ల గోరుమానుకొండ*



*డోన్ లోని రోడ్డులో..స్కూల్ లో..హాస్పిటల్..ప్రతి అభివృద్ధిలో నేనున్నా*


*అందుబాటులో లేనని ప్రచారం చేస్తోన్న ప్రతిపక్షాలకి నేను చేసిన అభివృద్ధే సమాధానం*


*బేతంచర్ల మండలంలోని గోరుమానుకొండలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*నిశాంత్ నాయక్, శేషాద్రి అనే చిన్నారుల ప్రసంగాలకు మంత్రి బుగ్గన ప్రశంసలు*


*ఎంబాయిని బొంబాయిగా, గోరుమానుకొండను బంగారుకొండ చేస్తానని గత ప్రభుత్వ ప్రగల్భాలు*


*ఐటీఐలో చదివిన వారికి ఉపయోగకరంగా ఎంఎస్ఎంఈ సెంటర్*


*శిక్షణ పూర్తయితే రూ.30వేలతో ఉద్యోగావకాశాలు*


*బేతంచెర్ల నలుమూలలా రూ.150 కోట్లతో రహదారులు*


*రూ.750 కోట్లతో డోన్ నియోజకవర్గంలో జాతీయ రహదారి ఏర్పాటు*


*అబద్ధాలకు పన్ను విధిస్తామంటే ప్రతిపక్షనాయకులు ఒక్కరూ గొంతు విప్పరు*


*నిద్రపోయేవారిని లేపవచ్చు..కళ్లు మూసుకుని నిద్రనటించే ప్రతిపక్షాలను ప్రజలు పడుకోబెడతారు*


*కౌలుపల్లెలాంటి చిన్న ఊరు సహా మొత్తం బేతంచర్ల మండలం వ్యాప్తంగా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు*


*రాబోయే రెండు నెలల్లో డోన్ నియోజకవర్గానికి భవిష్యత్ లో తాగునీటి కొరత లేకుండా ఇంటింటికి తాగునీరు*


*రూ.3 కోట్లతో కనుమకింద కొట్టాలలో బిలసర్గం గుహలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాం*


*బాబు ష్యూరిటీ ఓ బూటకం భవిష్యత్ గ్యారంటీ అనేది నాటకం*


*మనసులో మాట అని చంద్రబాబు పుస్తకం రాసి..హామీ నెరవేర్చక ఇప్పుడు ఎవరికీ దొరక్కుండా దాచారు*


*రాయితీలతో ఏపీఎస్ఆర్టీసీకి చాలా ఇబ్బందులంటూ పుస్తకం రాశారు*


*జర్నలిస్ట్ లు, స్వాతంత్ర్యసమరయోధులకు కూడా చంద్రబాబు రాయితీలు ఇవ్వొద్దన్నారు*


*సంక్షేమాన్ని విమర్శించిన వారే మరింత సంక్షేమం చేస్తామని హామీలివ్వడం విడ్డూరం*


*డోన్ నియోజకవర్గంలోని పేదలందరికీ సెంటున్నర ప్లాటంటూ డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగల్భాలు*


*బేతంచెర్లలో 12 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం సాధ్యమా?*


*ఎకరాకు రూ.కోటి వేసుకున్నా..300 ఎకరాలకు రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం ఆచరణ సాధ్యమా?*


*అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి అంటున్న ధర్మవరం సుబ్బారెడ్డి ఎంత మందికి అందుబాటులో ఉండి టోపీలు పెట్టారో డోన్ ప్రజలకు తెలుసు*


*అందుబాటులో లేనని ప్రచారం చేస్తున్న టీడీపీకి ఒకటే నా సమాధానం*


*డోన్ లో రూ.2,500 కోట్లతో చేసిన ప్రతి అభివృద్ధి పనిలో నేనున్నా*


*బేతంచెర్లలోని గోరుమానుకొండ గ్రామంలో రూ.48 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవం*


*రూ.36 కోట్లతో నిర్మించిన బీసీ బాలుర రెసిడెన్షియల్ (మహాత్మ జ్యోతిరావ్ పూలే) పాఠశాల, కళాశాల మంత్రి బుగ్గన చేతుల మీదుగా ప్రారంభం*


*రూ.8 కోట్లతో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన*


*రూ.4 కోట్లతో నిర్మించిన ఎమ్ఎస్ఎమ్ఈ సెంటర్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ప్రభుత్వ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*హాజరైన నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీ మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగరాజు.



Comments