లేపాక్షి" శిల్ప సంపద అద్భుతం - భారత ప్రధాని నరేంద్రమోడీ.

 లేపాక్షి" శిల్ప సంపద అద్భుతం -


భారత ప్రధాని నరేంద్రమోడీ.



లేపాక్షి, జనవరి 16  (ప్రజా అమరావతి ): భారత పురాతత్వ చరితంలో "లేపాక్షి" శిల్ప సంపద ఓ మహా అద్భుతం అని.. దేశ ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు.


మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శ్రీ సత్యసాయి జిల్లాలో.. చారిత్రాత్మక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిని దేశ ప్రధాని నరేంద్రమోడీ సందర్శించారు.


మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా లేపాక్షి హెలీప్యాడ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. లేపాక్షిలో పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళా ఖండాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. భారతీయ చారిత్రక పురాతన వైభవానికి, విజయనగర సామ్రాజ్య సంస్కృతీ, శిల్పకళా సంపదకు ప్రత్యక్ష అనవాళ్లుగా.. లేపాక్షి ఆలయ శిల్పకళా ఖండాలు ప్రతిబింభిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. భారతీయ పురాతన చరితాత్మక వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. లేపాక్షికి విచ్చేసిన దేశ ప్రధానిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు, బిజెపి కార్యకర్తలు తరలివచ్చారు.  ప్రధానమంత్రి పర్యట సందర్భంగా లేపాక్షి క్షేత్రంలో ప్రధాని కార్యాలయ భద్రతాధికారులు, రాష్ట్ర పోలీసు, అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.


అనంతరం గోరంట్ల.మండల పరిధిలోని పాలసముద్రంలో నూతనంగా నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.


కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ కమీషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, 



Comments