కిచెన్ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహరం:మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.

 *కిచెన్ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహరం:మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు


*
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కిచెన్ గార్డెన్  ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.


ఆదివారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు.


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు, అక్కడ అందు బాటులో ఉన్న వసతులు, మధ్యాహ్నం భోజనం, కిచెన్ గార్డెన్ నిర్వహణపై వివరా లు అడిగి తెలుసుకు న్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న 8 గుంటల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు, ఆకు కూరలు పెంచుతూ వాటిని పిల్లలకు పౌష్టికా హారం క్రింద మధ్యాహ్నం భోజనంలో అందించడం మంచి ఆలోచన అన్నారు.


ఈ కార్యక్రమాన్ని రూపొం దించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను, కట్టు దిట్టంగా నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అభినందించారు.

   

జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో సైతం సుల్తాన్పూర్ జడ్పీహెచ్ఎస్ ను ఆదర్శంగా తీసుకొని అందుబాటులో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, గ్రామ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్ రావు, ఉప సర్పంచ్ ఆకుల హరీష్ గౌడ్, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఏ. నరేంద్ర చారి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఏ సంతోష్ రెడ్డి, సంభందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు...

Comments