టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరికలు.*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరికలు**టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేతల ఘన నివాళి*


అమరావతి.  (ప్రజా అమరావతి ):- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ నేత ముక్కా రూపానందరెడ్డి, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దెబాబురావు, శ్రీకాకుళంనకు చెందిన రెడ్డి చిరంజీవి, కదిరికి చెందిన పీ.వీ.పవన్ కుమార్ రెడ్డి, మడకశిరకు చెందిన యం.వీ రమేష్ రెడ్డి, తదితరులు టీడీపీ తీర్థం పుచుకున్నారు. వీరికి చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. దానికి ముందు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వెళ్ళారు. రక్త దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు, పొలిట్ బ్యూర్ సభ్యులు  యనమల రామకృష్ణుడు, ఎంఏ.షరీఫ్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు గుండారపు లక్ష్మీదేవి కళావెంకట్రావు, బత్యాల చెంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments