పేదలకు నివేశన స్థలాల మంజూరుకు ముఖ్యమంత్రి జగనన్నతో మాట్లాడతా.

 *పేదలకు నివేశన స్థలాల మంజూరుకు ముఖ్యమంత్రి జగనన్నతో మాట్లాడతా.**వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గంజ్ చిరంజీవి*


*ఎమ్మెల్సీ హనుమంతరావు తో కలిసి ఆత్మకూరులో పర్యటన*


*గుడ్ మార్నింగ్ మంగళగిరి పేరిట నూతన కార్యక్రమం ప్రారంభం*


మంగళగిరి  (ప్రజా అమరావతి);

 నివేశన స్థలాల సమస్యను ముఖ్యమంత్రి జగనన్న దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయిస్తామని వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గంజి చిరంజీవి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సిపి అధినాయకత్వం ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ మంగళగిరి పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని ఆత్మకూరు టేకు తోటల వద్ద ఆయన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తో కలిసి సోమవారం ప్రారంభించారు. వైఎస్ఆర్సిపి మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ, వారు ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్ల స్థలాల మంజూరు జగనన్న లక్ష్యం అని చెప్పారు. వైఎస్ఆర్సిపి పరిపాలనలో అమలైన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజల సమస్యలను విన్న ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయించామని త్వరలో అసంపూర్తి పనులను కూడా జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మ శివరామిరెడ్డి, రామిరెడ్డి, జాలాది నాగేశ్వరరావు, పకీరయ్య, మన్యం నాగేశ్వరరావు, రవి,మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, నాయకులు గుండా మధు, తోట శ్రీనివాసరావు, బెజ్జం రాజాజీ, వ్యాసం అజయ్, రంజిశెట్టి పెద్దబ్బాయి, శంకర్, మహేష్, సుబ్బారావు, వల్లంశెట్టి విజయ్, నాగరాజు, సాంబయ్య, గుంటి రాజ్యలక్ష్మి, మిట్ట నిర్మల,వకులా దేవి, నరేష్,సర్దార్, సాయికుమార్, తదితర నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

Comments