జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం.


*రాష్ట్రానికి వైసీపీ అవసరమా?*


*జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం**వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దం*


*వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదు*


*వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల*


*వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం*


*నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అన్నావ్.. పన్నులు ఎందుకు వేశావ్,  అప్పులు ఎందుకు చేశావ్*


*చేసిన అప్పులు ఎవరు కడతారు? సాక్షి యాజమాన్యమా? భారతి సిమెంటా?*


*పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం*


 *నారా చంద్రబాబు నాయుడు* 


పీలేరు. (ప్రజా అమరావతి): వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్దులు కూడా దొరకటం లేదని రేపు జరగబోయే కురుక్షేత్ర ధర్మ యుద్దంలో టీడీపీ, జనసేనదే గెలుపు అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...... ఐదేళ్లపాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.  వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. జగన్ రెడ్డికి ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయటం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా?  యుద్దం ప్రారంభమైంది, దీనికి మేం సిద్దం మీరు సిద్దమా? వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్దంలో గెలుపు టీడీపీ, జనసేనదే. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారు.  ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? నేను రాయలసీమ బిడ్డనే నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమే. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవే. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లం. ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.  తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాయలసీమను పండ్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశా. దుర్మార్గులు అంతా నాశనం చేశారు. నాడు 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. 450 ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా? బాధితులకు ఏం న్యాయం చేశారు?  ప్రాజెక్టు గేట్లకు గ్రీసు వేయలేని సీఎం 3 రాజధానులు కడతారా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఇచ్చాం. 


*రూ. 10 ఇచ్చి రూ. 100 లాగేయటం జలగన్న పాలసీ*

జగన్ రెడ్డి అబద్దాలు చెప్పటంలో పీ.హెచ్ డీ చేశాడు. రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నాడు. అదే జలగన్న పాలసీ. బటన్ నొక్కుడు లో ఎంత దోచావో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు లేని పన్నులు, అప్పులు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. కరెంట్ చార్జీలు 5 రెట్లు పెంచారు. మద్య నిషేదంపై మాట తప్పి మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో  పేదల రక్తం త్రాగుతున్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకులేవు?  మద్యంపై నెలకు రూ. 6 వేల చొప్పున  ఏడాదికి రూ. 72 వేల రూపాయలు ప్రజలు సొమ్మును మింగుతున్నారు.  నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యవసర ధరలన్నీ పెరిగి పేదల బతుకులు ఛిద్రమయ్యియి. నాడు ఉచిత ఇసుక నేడు బంగారమైంది. ఎక్కడ చూచినా ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. నాటి కంటే నేడు బడ్జెట్ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి, కానీ బాదుడే బాదుడు. నాడు పన్నుల మోత, అప్పుల బాధ లేదు. 100 కి పైగా సంక్షేమ పధకాలు అందించాం. నేడు అవన్నీ ఏమయ్యాయి? విధ్వంసకర, అసమర్ద పాలనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత యువత తీసుకోవాలి. ప్రజల్ని చైతన్యం చేయాలి. విపరీతంగా అప్పులు పెరిగాయి. పెరిగిన అప్పులు జగన్ కడతాడా, సాక్షి యాజమాన్యం కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా? ప్రజలే కట్టాలి. 

*సైకో పాలనలో నష్టపోని వర్గం లేదు*

వైనాట్ కుప్పం, 175 కి 175 సీట్లన్నారు. నేడు  పీలేరు సాక్షిగా చెబుతున్నా వైనాట్ పులివెందుల. జగన్ 68 మంది ఇన్ ఛార్జులను మార్చారు, మీ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారమవుతుందా? ప్రజలు కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లేస్తే న్యాయం జరుగుతుందా? సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ ఆశించిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. ఒక వ్యక్తి మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులకు గురి అవుతారో 5 ఏళ్లుగా చూస్తున్నాం. సైకో పాలనలో నష్టపోని, ఇబ్బందులకు గురి కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అన్ని మతాలు, కులాలకు న్యాయం చేస్తాం. రాయలసీమకి న్యాయం చేసింది, చేయబోయేది టీడీపీ. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు భవిష్యత్ గ్యారెంటీతో ముందుకు వచ్చాం. ప్రతి ఆడబిడ్డకు రూ.1500, భవిష్యత్ లో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే చదువు కోసం అందరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ధరలు తగ్గించే బాధ్యత మాది. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. ప్రతి కార్యక్రమం యువత బాగా పాల్గొంటున్నారు. జాబు రావాలంటే బాబు రావాలి. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తాం. నేను ఐటీ ఉద్యోగాలిస్తే జగన్ వాలెంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీను ఇస్తాం. 74 రోజులు సైకిల్ ఎక్కి టీడీపీ, జనసేన జెండాలు పట్టుకొని యువత ఇంటింటికి వెళ్లాలి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా లోన్లు వచ్చాయా? టీడీపీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. అందుకే జయహో బీసీ పెట్టాం. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ టీడీపీ. షాదీతోఫా, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం, విదేశీ విద్యను అందించాం. కాని నేడు ఒక్క కార్యక్రమం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను తెస్తాం. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. కానీ మేం అలాకాదు.. ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. సంపద సృష్టి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం. టమోటా రైతులు బాగుపడలేదు. గిట్టుబాటు ధరను ఇప్పించి రైతును రాజుగా చేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు పెడతాం. టమోటా రైతులను ఆదుకుంటాం. రాయలసీమలో హార్టీకల్చర్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందిస్తాం. 

*వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడికి అడ్డూ, అదుపు లేదు*

వైసీపీలో ఒక్కరైనా విలువల గల మంత్రి ఉన్నారా? టూరిజం మంత్రిని చూస్తే వాళ్ల కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం లేదు, ఆయనకు టిఫిన్ ఇసుక, లంచ్ మైన్స్, డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. బకాసురుడిని మించిపోయాడు పెద్దిరెడ్డి. పుంగనూరులో ఈ సారి పెద్దిరెడ్డి గెలవడు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురుతుంది. నా దయా దాక్షిణ్యాల వలన పెద్ది రెడ్డి గెలిచారు. కాని ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తారో చూస్తాను. వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీని ఎక్స్ పోజ్ చేస్తే అంగళ్లులో మన మీద దాడి చేసి 600 మందిని జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాని రేపు నీ దగ్గర అధికారం ఉండదు అప్పుడు నిన్ను శిక్షించే బాధ్యత టీడీపీదే. పులివెందుల్లో కూడా మీ సైకో గెలవడని జగన్ కు చెప్పు పెద్దిరెడ్డి. బెరైటీస్ అంతా ఊడ్చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి రూ. 600 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు, ఈయన పాపాలకు ఎన్జీటీ రూ. 100 కోట్లు పైన్ చేసింది. శివశక్తి డైరీతో పాడి రైతుల్ని దోచుకుంటున్నారు.  పాపాల పెద్దిరెడ్డి రూ. 35 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేశారు.  దోచిన డబ్బంతా కక్కిస్తాం.  పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు. తంబళపల్లెలో  ఎక్కడ స్ధలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే పీలేరును పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలిగిరి, గుర్రం కొండ మైనింగ్ లో ఈయనే భాగస్వామి. రూ. 400 కోట్ల విలువైన భూముల్ని, రూ. 500 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు. మదనపల్లె, రాజంపేట ఎమ్మేల్యేను మార్చారు. కానీ పాపాల పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు?  రైల్వే కోడూరు ఎమ్మెల్యే మంగపేట ముగ్గుగనులు, ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాయచోటి ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు. ఇలాంటి వాల్లు మనకు అవసరమా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులందరినీ చిత్తు చిత్తుగా ఓడించాలి. 


*టీడీపీ అధికారంలోకి వచ్చాక* 

పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తాం. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె, తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం.  రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
Harshavardhan selected for Chennai Super Kings team
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image
India is on high-growth trajectory to achieve its development goals by 2047: Minister Hardeep S Puri.