ఆంధ్ర ప్రదేశ్ పాలసేకరణ (రైతుల రక్షణ) మరియు పాల నాణ్యతా ప్రమాణాల చట్టం – 2023 లైసెన్సు కొరకు ధరఖాస్తు

 ఆంధ్ర ప్రదేశ్ పాలసేకరణ (రైతుల రక్షణ)  

మరియు పాల నాణ్యతా ప్రమాణాల చట్టం – 2023

లైసెన్సు కొరకు ధరఖాస్తు   

అమరావతి (ప్రజా అమరావతి);

గెజిట్ నోటిఫికేషన్ నెంబర్- 295, తేది: 01.06.2023 మరియు గెజిట్ నోటిఫికేషన్ నెంబర్- 3681, తేది: 11.01.2024 ప్రకారం The Andhra Pradesh Milk Procurement (Protection of Farmers) and Enforcement of safety of Milk Standards Act, 2023, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11.01.2024 నుండి అమలు లోకి రావడం జరిగినది. దీనికి సంబంధించి పాలసేకరణ కేంద్రాలు / బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు మరియు పాల డెయిరీలలో వెన్న శాతం మరియు ఘనపదార్ధాల శాతముల నిర్ధారణ కొరకు వాడబడుతున్న మిల్క్ యనలైజర్ / ఎలక్ట్రానిక్  మిల్క్ టెస్టో మీటర్ లకు లైసెన్సు కలిగి ఉండటం తప్పనిసరి. కావున, వీటి నిర్వాహకులందరు వారు వాడుతున్న ఈ పరికరములకు 60 రోజుల లోపల అనగా, తేది: 10.03.2024 లోపు  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, పశుసంవర్ధక శాఖ వారి వెబ్ సైట్: https://ahd.aptonline.in/ నందు  మిల్క్ అనలైజర్స్  మరియు  మిల్క్ టెస్టో మీటర్ ల వివరములను పొందుపరిచి, తగు రుసుము చెల్లించి లైసెన్సు జారీ కొరకు ధరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ పశు సమర్ధక శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు

Comments