నర్సులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డు - 2024.

 

విజయవాడ (ప్రజా అమరావతి ); 

వృత్తే దైవంగా సేవే పరమార్థంగా భావించే అత్యుత్తమ సేవలు అందించే నర్సులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డు - 2024 లకు గాను  అర్హత కలిగిన వారి నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నామని వైద్య విద్యా సంచాలకులు డిఎస్ వి ఎల్. నరసింహం ఒక ప్రకటనలో తెలియజేసారు.  

ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మదినం సందర్భంగా దేశంలోని నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు ఆగ్జి లరీ నర్సులు మరియు మిడ్ వైఫ్, రిజిస్టర్డ్ నర్సులు మరియు మిడ్ వైఫ్ రిజిస్టర్డ్ లేడీ హెల్త్ విజిటర్స్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులు ఇస్తున్నట్లు నరసింహం తెలిపారు.  ఈ అవార్డుకు గాను నగదు రూపంలో రూ. 50 వేలు మరియు సర్టిఫికెట్ తో పాటు పతకాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు దారుని పూర్తి వివరాలు నమోదు కొరకు రాష్ట్ర కమిటీకి సంబందించిన ప్రత్యేక ఎంపిక ప్రమాణాలు ప్రక్రియ కొరకు www.indiannursingcouncil.org నందు అందుబాటులో ఉన్నట్లు సంచాలకులు వివరించారు.  నామినేషన్లు  స్వీకరణకు చివరి తేదీ 01-03-2024 సాయంత్రం 5 గంటల లోగా ఈ క్రింది చిరునామాకు పంపించగలరు.  

చిరునామా: సంచాలకుల వారి కార్యాలయం,

వైద్య విద్యా విభాగం,

పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణ, 

హనుమాన్ పేట,

విజయవాడ.  


Comments