మై భారత్ వికసిత్ భారత్ @2047 అంశం పై రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు ముగింపు.

 


గుంటూరు 

23 ఫిబ్రవరి  (ప్రజా అమరావతి);


*మై భారత్ వికసిత్ భారత్ @2047 అంశం పై రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు ముగింపు*

 భారత ప్రభుత్వము,  కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంగటన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో 23వ తేదీన మై భారత్ వికసిత్ భారత్ @2047 అంశం పై రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు ముగిసాయి.  ఇదే అంశం పై జిల్లా స్థాయి విజేతలకు ఈ పోటీ జరుగగా తిరుపతికి చెందిన ప్రగతి జైస్వాల్ ప్రధం స్థానం లో నిలిచి లక్ష రూపాయల బహుమతి అందుకోగా, అనకాపల్లి జిల్లా నుంచి వి లాస్య ప్రియ, వై ఎస్ ఆర్ జిల్లా నుంచి సయ్యద్ సానియా వరుసగా  ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు శ్రీమతి ఏ ఆర్ విజయరావు  యువత లో ప్రతిభను వెలికి తీయటానికి అలాగే వికసిత భారత్ పై వారి పరిజ్ఞానాన్ని పెంచటానికి ఇటువంటి ఉపన్యాస పోటీలు  ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలకు హాజరైన అందరినీ ఆమె అభినందించారు.  ఈ కార్యక్రమములో సభాద్యక్షత నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి  వహించగా, జ్యూరీ సభ్యులు గా ది హిందూ వార్త దిన పత్రిక గుంటూరు స్పెషల్ కరస్పాండెంట్ సాంబశివ రావు,   గుంటూరు ఏ సి కాలేజ్, పి జి కోర్సెస్ డీన్  డా. శ్రీధర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒరేటర్ డా. వీర జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. విజేతలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అతిథులు అందజేయగా, కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర రాష్ర్ట మరియ జిల్లా కార్యాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు

Comments