అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల కార్యాల‌యాల్లో 27న గ్రీవిస్స్ డే.

అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల కార్యాల‌యాల్లో 27న గ్రీవిస్స్ డే

వియ‌జ‌వాడ‌ (ప్రజా అమరావతి);, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జె.నివాస్ గారి ఆదేశ‌ల మేర‌కు అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల కార్యాల‌యాల్లో  ఈనెల 27న గ్రీవిన్స్ డేను నిర్వ‌హించాల‌ని ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ  శాఖ‌ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప‌రిధిలో ప‌నిచేసే ఉద్యోగుల్లో ఎవ‌రికైనా జీతాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లున్నా ఈనెల 27న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని  వ్య‌క్తిగ‌తంగా క‌లిసి విన‌తి ప‌త్రాల్ని అంద‌జేయాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో అందిన విన‌తుల‌న్నిటినీ విజ‌య‌వాడ‌, గొల్ల‌పూడిలోని ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ  శాఖ‌ డైరెక్ట‌ర్ కార్యాల‌యానికి పంపించాలని ఆమె తెలిపారు.


Comments