*శిక్షణ పొంది అత్యున్నత ఉద్యోగాలు పొందిన వారితో ఆపూర్వ సమ్మేళనం*
అమరావతి (ప్రజా అమరావతి );
సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సీడాప్), దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన(డి.డి.యూ-జి.కె.వై) ద్వారా శిక్షణ పొంది బహుళ జాతీయ కంపెనీల్లో అత్యున్నతమైన ఉద్యోగాలు పొందిన యువతతో విజయవాడలో ఫిబ్రవరి 21న పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ &ట్రైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగానే సోమవారం అమరావతి సచివాలయం బ్లాక్ -5లో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు (స్కిల్ (ట్రైనింగ్ & జాబ్ ఫెయిర్) గాది శ్రీధర్ రెడ్డితో కలిసి ఆహ్వాన పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కలలను సాకారం చేయుటకు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని సద్వినియోగం చేసుకుని ఆయారంగాల్లో స్థిరపడటం హర్షనీయమన్నారు. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన జోన్ – 1 మీట్ కి విశేష స్పందన లభించటంతో బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జోన్- 2లో శిక్షణ పొందిన బహుళ జాతీయ కంపెనీల్లో అత్యున్నతమైన ఉద్యోగాలు పొందిన యువతతో అల్యూమిని మీట్ నిర్వహిస్తున్నామని ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమ విధివిధానాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీడాప్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్యాంప్రసాద్, స్టేట్ మిషన్ మేనేజర్లు ఎం.విజయ కుమార్, డి.లక్ష్మి, ఎల్.ప్రసాద్ బాబు, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment