టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్లూజె ప్రతినిధులు.*టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్లూజె ప్రతినిధులు


*


*జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేత*


ఉండవల్లి (ప్రజా అమరావతి):- ఏపీయూడబ్ల్యూజే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాన్ని అందించి..అందులోని అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరణ, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా, నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల స్కీం పటిష్టత వంటి సుమారు 15 అంశాలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధుల సమస్యలు విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు రద్దు చేసిన పథకాలు మళ్లీ ప్రవేశపెడతామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APUWJ అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, IJU జాతీయ కార్యదర్శి సోమ సుందర్, చావా రవి తదితరులు పాల్గొన్నారు.

Comments