ఎడెక్స్ తో ఒప్పందం - ఉన్నత విద్యలో "గేమ్ ఛేంజర్".


అమరావతి (ప్రజా అమరావతి);


*పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం..*


*ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం*


*గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో.. నేడు (16.02.2024) సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం..*


*టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ..*


*ఎడెక్స్ తో ఒప్పందం - ఉన్నత విద్యలో "గేమ్ ఛేంజర్"*


*"ఎడెక్స్ ఒప్పందం" ముఖ్యాంశాలు*


మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే పరిస్థితి..

ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన..

హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ.. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..


*"ఎడెక్స్ ఒప్పందం"తో ప్రయోజనాలు*


ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను మన విద్యార్థులు ఉచితంగా నేర్చుకునే అవకాశం.. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే వీలు..

విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, యుసి బర్క్ లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు..

ప్రొఫెషనల్, సాంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి-- విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యసనా నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్ సహకారం..


*ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు..*


పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్ లోనూ ఇస్తూ.

జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం.. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు.. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.. కరిక్యులమ్ లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్.. తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్ లైన్ లో నేర్చుకునే వెసులుబాటు.. కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం.. ఇప్పటికే 7 లక్షల మంది విద్యార్థులు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, 5.2 లక్షల మంది 2 నెలల షార్ట్ టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2 లక్షల మంది 6 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు.

థియరీతో పాటు Industry oriented Courses చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది.

నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం... 50 బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు..

డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, IoT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ & ఇన్వెస్ట్ మెంట్స్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్, స్టాక్ ఎక్చేంజ్, సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి..

డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్ట్లు…

రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభుత్వం

సన్నాహాలు.. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం..

మన విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్ బీస్- జర్మనీ, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కెంపెన్- జర్మనీ, బ్లెకింగ్ - స్వీడన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బ్యాంకాక్ లతో అవగాహన ఒప్పందాలు..

ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయి

వినియోగానికి చర్యలు.. యూనివర్సిటీల్లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ ల ఏర్పాటు.. ఒక్కో జోన్ కు రూ.10 కోట్ల పెట్టుబడి.. ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం..

యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి Board for Community Development through Education (BCDE) ఏర్పాటు 

రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు..

2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో NAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437.

Comments