ఒంగోలు ప్రజలు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల


ఒంగోలు (ప్రజా అమరావతి);


*పేదల ఇంటి స్ధలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) పంపిణీ*


*ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే*


ఒంగోలు ప్రజలు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కలనెరవేరుతుంది. ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది, గతంలో 800 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకుంటే టీడీపీ వారు కోర్టులకెళ్ళి అడ్డుకున్నారు, టీడీపీ వారు సిగ్గుపడాలి, పేదలకు ఇచ్చే దానిపై రాజకీయాలా, టీడీపీ వారు ఒక్క పట్టా ఇచ్చారా, గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో నేను పట్టాలిచ్చాను, సీఎంగారు ఇచ్చిన మాట మేరకు ఈ పట్టాల కోసం రూ. 231 కోట్లు ఇచ్చారు, కానీ దీనిపై కూడా టీడీపీ వారు కోర్టుకెళ్ళి పేదలకు ఇవ్వడం లేదని అడ్డుకునే ప్రయత్నం చేశారు, రైతులు ఎమ్మెల్యేకు డబ్బులిచ్చారు అన్నారు, నేను ఒక్క రూపాయి అయినా రైతు దగ్గర తీసుకుని ఉంటే నా యావదాస్తి రాసి ఇచ్చేస్తా, నేను ఒకటే చెబుతున్నా, నేను నా రాజకీయ జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయలేదు, దివంగత వైఎస్‌ఆర్‌ గారు చెప్పినట్లు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్న మాట మేరకు మా ఒంగోలు ప్రజలు నాపై ఇంత ఆప్యాయత చూపించారు. సీఎంగారు ఇళ్ళ పట్టాలతో పాటు ఇళ్ళు కూడా శాంక్షన్‌ చేశారు, అంతా వైఎస్‌ఆర్‌ పార్టీ వారికి ఇచ్చారని నిన్న ఒకాయన అన్నారు, సిగ్గుపడాలి, ఇల్లు లేని వారికే ఇచ్చాం తప్పు ఇల్లు ఉన్నవారికి ఇవ్వలేదు. పేదలకే పట్టాలిచ్చాం, కొంతమందికి ఇబ్బందుల వల్ల ఇవ్వలేదు, అర్హులు అందరికీ వెంటనే ఇవ్వమని సీఎంగారు చెప్పారు, నీటి సరఫరా కోసం అవసరమైన నిధులు కూడా శాంక్షన్‌ చేశారు, గతంలో సీఎంగారు ఇచ్చిన మాట ప్రకారం నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం, ఆరేడు నెలల్లో ప్రతి రోజూ ఒంగోలు పట్టణానికి మంచినీటి సరఫరా చేస్తాం, ప్రకాశం జిల్లాలో 12 కు 12 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం. ధన్యవాదాలు.  


*లలిత మౌనిక, లబ్ధిదారు, ఒంగోలు*


అన్నా నేను నిరుపేదరాలిని, నాలాంటి ఎంతోమంది పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది, కానీ మీ వల్ల నిజమైంది, మేమంతా ఈ రోజు మీ వల్ల లక్షాధికారులయ్యాం, మేమంతా మీకు రుణపడి ఉంటామన్నా, గడప గడపకు కార్యక్రమంలో వాసన్న మా ఇంటికి వచ్చి ఏం కావలన్నారు, ఇంటి సమస్య చెబితే పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి పట్టా ఇచ్చారు, నేను డ్వాక్రా గ్రూప్‌ సభ్యురాలని, మా గ్రూప్‌ మీ హయాంలో రూ. 20 లక్షలు తీసుకంటే నాకు వచ్చిన రూ. 2 లక్షలతో బ్యూటీపార్లర్‌ పెట్టుకుని నెలకు రూ. 6,000 నుంచి రూ. 7,000 సంపాదిస్తున్నాను, నా భర్త ఆటో డ్రైవర్, తనకు వాహన మిత్ర సాయం అందింది, మీరు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియంలో మా పిల్లలు చదివి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు, స్కూల్‌లో చక్కటి పౌష్టికాహారం ఇస్తున్నారు, మేం గతంలో ఇంటి స్ధలం కోసం చాలా సార్లు దరఖాస్తు చేసినా ఎవరూ ఇవ్వలేదు, మీరు ఇచ్చారు అన్నా, నాకు ఇంటి నిర్మాణానికి కూడా తక్కువ ధరకే అన్నీ ఇచ్చారు, మాలాంటి నిరుపేదలు నాలాగా చాలా లబ్ధిపొందారు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అన్నా, మేమంతా మీ వెన్నంటి ఉండి మీతో ప్రయాణించడానికి సిద్దంగా ఉన్నాం అన్నా, ధ్యాంక్యూ.


*శివపార్వతి, లబ్ధిదారు, 33 వ డివిజన్, ఒంగోలు*


అన్నా, నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, మీ ద్వారా నా సొంత ఇంటికల నెరవేరింది, వాసన్న గడప గడపకూ కార్యక్రమంలో వచ్చినప్పుడు చెప్పాం, మాకు ఇచ్చిన మాట నెరవేరింది, నాకు ఇచ్చిన స్ధలం విలువ రూ. 6 లక్షలు, పైగా ఇల్లు కూడా కట్టించి రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నారు, ధన్యవాదాలు. అన్నా నేను ఒంటరి మహిళను, నాకు భరోసా కల్పించారు, నాకు ఇద్దరు పిల్లలు, నేను ఒంటరి మహిళ పెన్షన్‌ తీసుకుంటున్నాను, నేను పిండిమర ఏర్పాటుచేసుకుని దాని ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నాను, నేను చదువుకోవాలన్న కోరిక నెరవేరలేదు, కానీ నా పిల్లలను మీరు బాగా చదివిస్తున్నారు, నా కుటంబాన్ని ఆదుకున్నది మీరే, నా తల్లిదండ్రులు లేరు, నాలాంటి వారికి నేను ఉన్నానమ్మా నేను విన్నానమ్మా అని మీరు భరోసా ఇచ్చారు, నేను మీ వల్ల అనేక పథకాలు లబ్ధిపొందాను, నా ఒక్క కుటుంబానికే లక్షల లబ్ధి జరిగిందంటే నాలాంటి పేదలందరికీ మీరు ఎంత సాయం చేశారో అర్ధమవుతుంది, థ్యాంక్యూ అన్నా.

Comments