ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తుంది.

 *ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తుంది*



*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీరని ద్రోహం* 


*ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి ఎందుకు మళ్ళించారు*


*దేశంలో రాజధాని లేని రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్*


*రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు వెల్లడి*

అమరావతి (ప్రజా అమరావతి);

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధంగా ఉందని తెలిపారు.మీడియా సమావేశంలో నాగేశ్వరావు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి నమ్మి ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించారని ఏ ఒక్క సామాజి వర్గానికి కూడా మేలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ గాని ,ప్రాజెక్టునిగాని నిర్మించలేదని కనీసంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నాగేశ్వరావు ఆగ్రహవ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలు, ఇతర పథకాలకు ఎందుకు మళ్లించారని అధికారం ముఖ్యమంత్రి ఎక్కడ దని ఆయన ప్రశ్నించారు.

దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని అధికార పార్టీ రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం కక్షలు కార్పన్యాలతో కాలం వెళ్లబు చ్చిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సభ్యులను దారి మళ్ళించి సంక్షేమ పథకాలు పేరుతో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి గండి కొట్టారని విమర్శించారు

మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, అంటూ వారిని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుద్యోగ సమస్య నానాటికి రాష్ట్రంలో తీవ్రమవుతుందని నిరుద్యోగులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు 2019 జరిగిన ఎన్నికలలో ఒక్క అవకాశం అంటూ ప్రజల ముందుకు వచ్చి ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024లో ఇదే ఎస్సీలు ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తగిన బుద్ధి చెబుతారని 2019లో ఇచ్చిన ఒక్క అవకాశం చివరి అవకాశం అనే ఎద్దేవా చేశారు.రాబోయే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు పరసా రంగనాథ్ ,వలి మైనార్టీ నాయకులు  ఆసిఫ్ భాష , శివ , తోట ఫణీంద్ర,శ్రీకాంత్ ,దుర్గ తదితర ఆర్.పి.ఐ నాయకులు పాల్గొన్నారు.

Comments