ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి ది..
కొల్లిపరలో ప్రశంసించిన గౌ|| (ఎంపీ) శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.
కొల్లిపర (ప్రజా అమరావతి);
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని రాజ్య సభ సభ్యులు, కృష్ణా - ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు.. నేడు సోమవారం గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గం, కొల్లిపరలో| శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (ఎంపీ) నిధులతో ఏర్పాటు చేసిన సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, హిందూ స్మశాన ప్రహరీ గోడ నిర్మాణాలను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా , తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు అన్నా భతుని శివ కుమార్ , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే తెనాలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.. ఇంకా మిగిలి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
addComments
Post a Comment