విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి.

 *విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి.*


  : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి. 

తాడేపల్లి (ప్రజా అమరావతి);

 కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ ప్రతీ ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సురభి వేడుకలు ఘనంగా ముగిశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి ఆయా కళాశాలల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆట పాటలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్దుల కేరితంలతో వర్శిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయి విద్యార్దులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్దులు విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను కూడా అలవరచుకోవాలన్నారు. అనంతరం ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఆచార్యులకు పురస్కారాలను అందజేశారు.  వైస్ చాన్సులర్ డాక్టర్ .పార్ధసారదివర్మ మాట్లాడుతూ కెఎల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతుందన్నారు. పలు రకాల కోర్సులను తాము వినూత్నంగా సమకూర్చి విద్యార్దులకు సులభ రీతిలో భోధనా పద్దతులను పాటించడం వలన విదేశాలలో సైతం తమ విద్యార్ధులు ఇంటర్న్ షిప్ లు పొందుకోవడంతో పాటు విదేశాలలో ఉద్యోగాలను సాదిస్తున్నారని అన్నారు. విద్యార్ధులకు స్నేహపూర్వకమైన విద్యాభోదన చేయడంలో తమ అధ్యాపకులు విజయం సాదించారని అధ్యాపకులను అభినందించారు. స్కిల్ కోర్సులను విద్యార్ధులకు నేర్పడంలో దేశంలోనే తమకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ర్యాంకు వచ్చిందన్నారు. విద్యార్ధులకు నైపుణ్యాలను నేర్పడంలో కెఎల్ యు అధ్యాపకుల తీరును అభినందించారు. పరిశోధనలలో అంతర్జాతీయ స్థాయిలో తమ వర్శిటీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన సర్వేలో ప్రపంచంలోనే టాప్ 2 శాతం గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలలో 9 మంది తమ క్యాంపస్ లో ఉన్నారని అన్నారు. పలురకాల జర్నల్స్ లో కొన్నివందల పరిశోధనా పత్రాలను తమ అధ్యాపకులు ప్రచురించడంలో కెఎల్ యు రికార్డులు సృష్టించిందన్నారు. వంద శాతం ఉద్యోగాల కల్పనకోసం తమ అధ్యాపకులు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్ధులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా పలు కార్యక్రమాలలో వారిని బాగస్వాములను చేయడం ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రపంచంలోనే టాప్ 2 శాతం శాస్త్రవేత్తలు గా గుర్తింపు పొందిన కెఎల్ యు ఆచార్యులు డాక్టర్ బి.నాగేశ్వరరావు, డాక్టర్ గందర్బ ష్వైన్, డాక్టర్ బిటిపి మాధవ్, డాక్టర్ ఎం.జానకిరామయ్య, డాక్టర్ ఎన్.షణ్ముగన్, డాక్టర్ సి.సంతోష్, డాక్టర్ కుమార్ నాయక్, డాక్టర్ అతుల్ మట్టాడ, లోకేంద్ర సింగ్ లకు పురస్కారాలను అందజేశారు. వీరితో పాటు ఉత్తమ ఆచార్యులకుగా ఎంపికయిన 61 మందికి కూడా పురస్కారాలతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం  వైస్ చాన్సులర్ డాక్టర్ .పార్ధసారదివర్మ, ప్రో విసిలు డాక్టర్ ఎవిఎస్ ప్రాసద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్  డాక్టర్ కె.సుబ్బారావు, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అన్ని విబాగాల ప్రిన్సిపల్స్, అన్ని విబాగాల అధిపతులు , అద్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Comments