ఐ & బీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు.*ఐ & బీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు


*

హైదరాబాద్ (ప్రజా అమరావతి);శ్రీ సంజయ్ జాజు ఈరోజు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ కేడర్‌కు చెందిన 1992-బ్యాచ్  ఐ ఏ ఎస్ అధికారి. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత, మాజీ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మరియు మంత్రిత్వ శాఖ మరియు వివిధ మీడియా విభాగాల ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.


 
శ్రీ జాజు గతం లో 2018 నుండి 2023 వరకు భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శిగా మరియు అక్టోబర్ 2014 నుండి మార్చి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పనిచేశారు.


ఆయన మే 2011 నుండి అక్టోబర్ 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (ఎలక్ట్రానిక్స్, ఐటి మరియు కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్) కార్యదర్శిగా పనిచేశారు.


 

Comments