వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణికి నారా భువనేశ్వరి పరామర్శ.



*గ్రామంలో సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా....మనం ఏ కాలంలో ఉన్నాం?:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి*


*వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణికి నారా భువనేశ్వరి పరామర్శ


*


*దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ*


*కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదన్న హంసవేణి మాటలతో భావోద్వేగానికి గురైన భువనేశ్వరి*


చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి):- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో హంసవేణి అనే మహిళపై దాడి చేసి కంటి చూపు పోగొట్టిన ఘటనఫై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా....మనం ఏ కాలంలో ఉన్నాం అని భువనేశ్వరి అన్నారు. నిజం గెలివాలి పర్యటనలో ఉన్న భువనేశ్వరి వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణిని గురువారం పరామర్శించారు. హంసవేణిపై దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భర్త లేకపోయినా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న మహిళపై దాడి చేసి కళ్లు పొగొట్టడంపై భువనేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హంసవేణికి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడైన హంసవేణి కుమారుడి బాధ్యత తీసుకుంటామని భవనేశ్వరి హామీ ఇచ్చారు. కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదని హంసవేణి అన్న మాటలతో భువనేశ్వరి భావోద్వేగానికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలని హంసవేణి కి  భువనేశ్వరి ధైర్యం చెప్పారు.

Comments