మంగళగిరి పట్టణ చిరు వ్యాపారుల నారా లోకేష్ చేయూత.

 *మంగళగిరి పట్టణ చిరు వ్యాపారుల నారా లోకేష్ చేయూత*



*లోకేష్ సహకారంతో 6గురికి టిఫిన్ బళ్లు, 8మందికి తోపుడు బళ్లు పంపిణీ*


*10 మందికి వెల్డింగ్ మిషన్లు, 4గురికి సెలూన్ ఛైర్లు పంపిణీ*


*చేయూతనందించిన నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు*


మంగళగిరి, ఫిబ్రవరి 27 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి పట్టణ చిరువ్యాపారులకు చేయూత నందించారు. మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని చిరు వ్యాపారుల జీవన ఉపాధి కోసం వివిధ రకాల బళ్లు, వెల్డింగ్ మిషన్లు, సెలూన్ చైర్లను ఆల్ఫా హోటల్ వద్ద అందజేశారు.  6గురికి టిఫిన్ బళ్లు, 8మందికి తోపుడు బళ్లు, 10 మందికి వెల్డింగ్ మిషన్లు, 4గురికి సెలూన్ ఛైర్లను ఉచితంగా టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. అద్దె బండ్లు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నామని, తమకు బళ్లు అందజేయాలని నారా లోకేష్ ని కోరగా వెంటనే స్పందించిన ఆయన స్థానిక నాయకుల చేతుల మీదుగా బళ్లను, వెల్డింగ్ మిషన్లు, సెలూన్ ఛైర్లను అందజేయించారు.  ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు చేస్తూ అండగా ఉంటారని అన్నారు. టీడీపీ గెలిస్తే  ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందటంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు.నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో భారీ మేజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్ధుల్ మజీద్, రాష్ట్ర నాయిబ్రహ్మణ సాధికార సమితి సభ్యులు మున్నంగి శివశేషగిరిరావు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, పట్టణ బీసీ సెల్ ఆధ్యక్షులు వాకా మాధవరావు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిండ్ల సత్యానందం, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షులు పేరం ఏడుకొండలు, పట్టణ కార్యదర్శి భైరబోయిన శ్రీనివాస్, పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి పినపాటి జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా, గుంటూరు పార్లమెంట్ పద్మశాలీయ సాధికార సమితి సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ, జగ్గారపు రాము, షేక్ జిలానీ, మద్దిరాల రమేష్ బాబు, చింతా వెంకటేశ్వరావు, బిట్రా నాగరాజు, వనమా సురేష్, కొత్తపేట హూస్సేన్, మల్లెల నాగయ్య, అబ్దుల్లా ఖాన్, ఆకునూరు ఉమామహేశ్వరరావు, అడిగోపుల శ్రీను, షేక్ కరీముల్లా, షేక్ ఇస్మాయిల్, తురకా వీరశేఖర్ బాబు, కొప్పూరి రాంబాబు, యుద్దం అప్పారావు, షేక్ నజీర్,  షేక్ సమీరా, తదితరులు పాల్గొన్నారు.

Comments