నా పర్యటనలకు ప్రత్యేక ఆంక్షలెందుకు : మంత్రి తుమ్మల.

 


నా  పర్యటనలకు ప్రత్యేక ఆంక్షలెందుకు : మంత్రి తుమ్మల ఖమ్మం (ప్రజా అమరావతి ): నా పర్యటనల పట్ల ప్రత్యేక ఆంక్షలెందుకు అని మంత్రి తుమ్మల పోలీసులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర పోలీసు అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.


ముఖ్యంగా నగరంలో తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దని, తన కాన్వాయ్ లో ట్రాఫిక్ పోలీస్ వెహికిల్ తప్ప వేరే వాహనాలు అవసరం లేదని, అదే విధంగా వివిధ స్టేషన్ల పరిధి నుండి వచ్చే లైజనింగ్ వాహనాలు కాన్వాయ్ లో అవసరం లేదని అన్నారు. వారు తమ స్టేషన్లలో విధులు నిర్వహించుకావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ రమణ మూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, టూ టౌన్ సీసిఐ బాలకృష్ణ, ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ట్రాఫిక్ ఎస్సై రవి కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments