పేదల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ కి అండగా ఉండేందుకు మంగళగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు - ఎమ్మెల్యే ఆర్కే..

 *పేదల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ కి అండగా ఉండేందుకు మంగళగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు - ఎమ్మెల్యే ఆర్కే..


.*

మంగళగిరి (ప్రజా అమరావతి);

*మార్చి నెల మూడో తేదీన జరగనున్న సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, వైఎస్ఆర్సిపి నాయకులు చిల్లపల్లి మోహన్ రావు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు...*


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ :


ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల హక్కులను నిర్ణయిస్తూ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగుతుందని అన్నారు...


పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమంలో మరియు వారిని రాజ్యాధికారం వైపు నడిపించే దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్ గారికే దక్కుతుందని అన్నారు...


కేవలం రెండే పేజీల మానిఫెస్టో ప్రకటించి.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 90% పైబడి ఇచ్చిన హామీలను అమలు చేసిన ధీశాలి జగన్ ఆని కొనియాడారు...


మీ కుటుంబంలో మంచి జరిగితేనే మంచి జరిగితేనే నాకు అండగా నిలవండి అనే దమ్ము రాష్ట్రంలో కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని అన్నారు...


పేద ప్రజల సంక్షేమం కోసం జగన్  పాటుపడుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం పేదలపై యుద్ధానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు...


ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ మరియు రూరల్ పార్టీ అధ్యక్షులు, జెసియస్ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments